అదంతా ఫేక్.. రజినీకాంత్ ఫ్యాన్స్‌కు హెచ్చరిక!

Published on Sun, 08/24/2025 - 10:49

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ ఇటీవలే కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. లోకేశ్ కనగరాజ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో తమిళ ఇండస్ట్రీ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ మూవీలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్, శృతిహాసన్‌ కీలక పాత్రలు పోషించారు.

అయితే తాజాగా తలైవాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. రజినీకాంత్‌ తన ఫ్యాన్స్‌తో మలేసియాలో మీట్ అవుతున్నారని సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. మాలిక్ స్ట్రీమ్స్‌ కార్పొరేషన్‌ పేరుతో ఈ ప్రచారం జరుగుతోంది. దీనిపై రజినీకాంత్ ప్రతినిధులు స్పందించారు. మలేసియాలో ఫ్యాన్స్‌ గ్రీట్ అండ్ మీట్‌ లాంటివీ తాము నిర్వహించడం లేదన్నారు. అలాంటి వాటిని నమ్మి అభిమానులు మోసపోవద్దని రజినీకాంత్ టీమ్‌ హెచ్చరించింది. ఏదైనా ఉంటే తామే అధికారికంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు అధికారిక ప్రకటన రిలీజ్ చేశారు.

రజినీకాంత్ టీమ్ లేఖలో ‍రాస్తూ.. "ప్రియమైన అభిమానుంలదరికీ.. ప్రస్తుతం మాలిక్ స్ట్రీమ్స్ ప్రమోట్ చేస్తున్న 'మీట్ అండ్‌ గ్రీట్ తలైవార్' అనేది పూర్తిగా అనధికారిక ప్రకటన. ఇలాంటి ఫేక్ ప్రకటనలు ఎటువంటి ముందస్తు అనుమతి పొందకుండానే ప్రమోట్ చేస్తున్నారు. ఫేక్‌ వాటిపట్ల అభిమానులు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వాటితో అభిమానులను తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. తప్పుడు ప్రకటనలు నమ్మి ఎవరు కూడా పాల్గొనవద్దని అభిమానులను, ప్రజలను గట్టిగా హెచ్చరిస్తున్నాం' అని ప్రకటన విడుదల చేశారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)