Breaking News

ఏమి రైటింగ్‌ ఫెంటాస్టిక్‌.. దర్శకుడిపై రజనీ ప్రశంసలు!

Published on Thu, 03/06/2025 - 08:16

ఏమి రైటింగ్‌. ఫెంటాస్టిక్‌. ఈ మాటలు అన్నది ఎవరో కాదు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌(Rajinikanth). ఇటీవల మంచి కంటెంట్‌తో కూడిన చిన్న చిత్రాలు మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. అలాంటి చిత్రాల్లో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్(Return of the Dragon) ఒకటి. నటుడు, దర్శకుడు ప్రదీప్‌ రంగనాథన్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కయాడు లోహర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఓ మై కడవులే చిత్రం ఫేమ్‌ అశ్వద్‌ మారిముత్తు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే తెరపైకి వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. 

దీంతో పలువురు సినీ ప్రముఖులు దర్శకుడు అశ్వద్‌ మారిముత్తును అభినందనలతో ముంచెత్తుతున్నారు. కాగా  మంచి చిత్రాలను, ప్రతిభావంతులైన కళాకారులను ప్రశంసించడంలో ముందుండే నటుడు రజనీకాంత్‌ ఇటీవల డ్రాగన్‌ చిత్రాన్ని చూసి,వెంటనే ఆ చిత్రం దర్శకుడు అశ్వద్‌ మారిముత్తును తన ఇంటికి ఆహ్వానించి ఎంతగానో ప్రశంసించారు. ఏమి రైటింగ్‌ ఫెంటాస్టిక్‌ అంటూ డ్రాగన్‌ చిత్ర కథ గురించి అభినందించారు. 

ఈ విషయాన్ని దర్శకుడు అశ్వద్‌ మారిముత్తు తన ఎక్స్‌ మీడియాలో పేర్కొంటూ రజనీకాంత్‌తో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. అందులో  ‘‘మంచి చిత్రాన్ని చేయాలి. దాన్ని రజనీకాంత్‌ చూసి ప్రశంశించాలి. ఇంటికి పిలిపించి అభినందించాలి. మా చిత్రం గురించి మాట్లాడాలి అని కష్టపడి పనిచేసే ఎందరో సహాయం దర్శకులు కలలు కంటారు. అలాంటి నా కల ఇప్పుడు నెరవేరింది ‘‘ అని పేర్కొన్నారు. ఇప్పుడు ఈయన వ్యాఖ్యలు, రజనీకాంత్‌తో ఈయన దిగిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.  

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)