Breaking News

రజినీకాంత్ కూలీ.. ఫస్ట్ సింగిల్ వచ్చేసింది!

Published on Wed, 06/25/2025 - 18:34

రజనీకాంత్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం కూలీ. ఈ సినిమాను లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శృతిహాసన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లియో చిత్రం తర్వాత లోకేష్ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని దాదాపు రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. చికిటు అంటూ సాగే ఈ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతమందించారు. ఈ పాటకు అరివు లిరిక్స్ అందించారు. ఈ సాంగ్‌ను రాజేందర్, అరివు, అనిరుధ్ రవిచందర్ ఆలపించారు.

రజినీకి భారీ పారితోషికం..

ఈ మూవీ బడ్జెట్‌తో పాటు తలైవా రజినీకాంత్‌ పారితోషికం సైతం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఆయనకు ఏకంగా రూ.150 కోట్ల రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో రజినీకాంత్‌ కెరీర్‌లో కూలీ మూవీ అత్యధిక పారితోషికం చెల్లించిన చిత్రాల్లో ఒకటిగా నిలవనుంది. అంతేకాకుండా ఈ చిత్రానికి డైరెక్టర్ ‍కనగరాజ్‌ సైతం రూ.50 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు ఓ నివేదికలో వెల్లడైంది. మిగిలిన రూ.150 కోట్లతో సినిమా బడ్జెట్‌, ఇతర నటీనటులకు ఖర్చు చేయనున్నారు. ఇది కాకుండా నిర్మాతలు పబ్లిసిటీ కోసం దాదాపు రూ. 25 కోట్లు పక్కన పెట్టారని సమాచారం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)