Breaking News

దారుణంగా రజినీకాంత్ కొత్త సినిమా పరిస్థితి.. కానీ ఎందుకిలా?

Published on Mon, 02/05/2024 - 16:02

ఈ వారం థియేటర్లలో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వాటిలో సూపర్‌స్టార్ రజినీకాంత్ మూవీ కూడా ఒకటుంది. ఏంటి నిజమా? అని మీరు అనొచ్చు. కానీ అదే నిజం. 'లాల్ సలామ్' పేరుతో తీసిన ఈ చిత్రాన్ని సంక్రాంతికే విడుదల చేయాలనుకున్నారు. కానీ ఏమైందో ఏమో వాయిదా వేశారు. ఇప్పుడు థియేటర్లలో తీసుకొస్తున్నా సరే ఒక్కడూ పట్టించుకోవట్లేదు. పేరుకే సూపర్‌స్టార్ గానీ అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది?

రజినీకాంత్ అంటే తెలుగులోనూ క్రేజ్ ఉంది. కానీ అదంతా ఒకప్పుడు. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాల వల్ల మన ప్రేక్షకులు ఈయ‍న్ని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. సరిగ్గా అలాంటి టైంలోనే.. అంటే గతేడాది 'జైలర్' రిలీజైంది. విడుదలకు ముందు దీనిపై ఎవరికీ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. కానీ ఒక్క పాట, హీరోకి ఇచ్చిన ఎలివేషన్స్ పుణ్యామా అని మూవీ హిట్ అయిపోయింది. రజినీ కమ్ బ్యాక్ అని హడావుడి చేశారు. ఇక్కడివరకు బాగానే ఉంది.

(ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్‌ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?)

ఇప్పుడు అదే రజినీ నుంచి 'జైలర్' లాంటి హిట్ తర్వాత మరో సినిమా వస్తుంటే అసలు హైప్ అనేదే ఎక్కడా కనిపించట్లేదు. ఈ చిత్రంలో రజినీకాంత్‌ది గెస్ట్ రోల్ అయినప్పటికీ.. దీన్ని ఈయన మూవీగానే చూస్తారు. కానీ ఎందుకో అది జరగట్లేదు. రజినీ కూతురు ఐశ్వర్య.. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది. కానీ ఈ సినిమా అనేది ఒకటి థియేటర్లలోకి వస్తోందనేది కూడా చాలామందికి ఇప్పటికీ తెలియదు.

తమిళనాడులో ఆడియో లాంచ్ పేరిట ఓ ఈవెంట్ నిర్వహించారు కానీ తెలుగులో కనీస ప్రమోషన్స్ చేయట్లేదు. ఇదంతా చూస్తుంటే రజినీకాంత్.. తెలుగు ప్రేక్షకుల్ని లైట్ తీసుకుంటున్నారా?  లేదంటే ఈ సినిమా మీద నమ్మకం లేదా అనే డౌట్ వస్తోంది. అందువల్లనే తెలుగులో కనీస పబ్లిసిటీ చేయట్లేదా అని జనాలు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. రజినీకాంత్ సినిమాకు ఇలాంటి దారుణమైన పరిస్థితి రావడం ఏంటా అనిపిస్తోంది.  

(ఇదీ చదవండి: రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?)

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)