Breaking News

సూపర్‍స్టార్ కొత్త సినిమాకు లీగల్ సమస్యలు

Published on Sun, 07/16/2023 - 19:26

Rajinikanth Jailer Movie:సూపర్‌స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'జైలర్'. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే నెల 10న థియేటర్లలోకి రాబోతుంది. పెద్దగా బజ్ లేని ఈ సినిమా ఇప్పుడు లీగల్ సమస్యల్లో చిక్కుకుంది. ప్రస్తుతం ఈ విషయమే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. త్వరలో కోర్టు హియరింగ్ కూడా ఉంది.

ఒకప్పటితో పోలిస్తే రజినీకాంత్ సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గింది. సరైన కథాకథనాలు లేకపోవడం, దీంతో బాక్సాఫీస్ దగ్గర సూపర్ స్టార్ చిత్రాలన్నీ ఫెయిలవుతూ ఉండటం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో 'జైలర్' చేస్తున్నారు. ఇప్పుడు ఈ టైటిల్ తమదే అంటూ మలయాళ దర్శకుడు సక్కిర్ మడతిల్ కోర్టుని ఆశ్రయించారు.

(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో?)

సదరు మలయాళ డైరెక్టర్ చెప్పిన దాని ప్రకారం.. ఆగస్టు 2021లో కేరళ ఫిల్మ్ ఛాంబర్ లో 'జైలర్' టైటిల్ రిజిస్టర్ చేయించుకున్నారు. అదే ఏడాది నవంబరులో షూటింగ్ ప్రారంభించారు. కానీ ఆర్థిక సమస్యల వల్ల ప్రొడక్షన్ ఆలస్యమైంది. ఈ రెండు సినిమాల స్టోరీలు వేర్వేరు అయినప్పటికీ కలెక్షన్స్ పై ఆ ఎఫెక్ట్ పడుతుందని సక్కిర్ అభిప్రాయపడ్డారు. 

ఈ క్రమంలోనే మిగతా భాషల్లో కుదరకపోయినా మలయాళ వరకు అయినా సరే రజినీకాంత్ సినిమా టైటిల్ మార్చి విడుదల చేయాల్సిందేనని దర్శకుడు సక్కిర్ మడతిల్ పట్టుబడుతున్నారు. మరోవైపు మార్కెట్ పరంగా తమ చిత్రానికి ఎక్కడా నష్టం రాకూడదనే ఉద్దేశంతో సన్ పిక్చర్స్ సంస్థ కోర్టుని ఆశ్రయించారు. ఆగస్టు 2న హియరింగ్ ఉంది. ఆ రోజు ఈ వివాదంపై క్లారిటీ వస్తుంది. 

(ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?)

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)