జైలర్‌ రికార్డు స్థాయి వసూళ్లు, తొలిరోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?

Published on Fri, 08/11/2023 - 11:49

సక్సెస్‌ కోసం రజనీకాంత్‌.. రజనీ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. జైలర్‌ చిత్రంతో వీరి కల నిజమైంది. తలైవా స్టైల్‌, యాక్షన్‌, డైలాగ్‌ డెలివరీకి అభిమానులు ముచ్చటపడిపోతుంటే.. పాజిటివ్‌ టాక్‌ రావడంతో రజనీ పండగ చేసుకుంటున్నాడు. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 10న థియేటర్లలో విడుదలైంది.

ఒక్క తమిళనాడులోనే ఈ చిత్రం రూ.24 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు తెలుస్తోంది. కేరళలో రూ.6 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో చెరో రూ.5 కోట్లు, కర్ణాటకలో రూ.10 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే కలెక్షన్స్‌ రాగా.. వీటన్నింటినీ కలుపుకుని మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.75-85 కోట్ల మేర సాధించినట్లు తెలుస్తోంది. వీకెండ్‌ కాకపోయినా ఇన్ని కోట్లు రాబట్టిందంటే మామూలు విషయం కాదంటున్నారు ఫ్యాన్స్‌. కొందరు హీరోలకు ఇవి లైఫ్‌టైమ్‌ వసూళ్లు అని కామెంట్లు చేస్తున్నారు. ఇక తొలి రోజు థియేటర్ల వద్ద రజనీ అభిమానులు సందడి చేశారు. ఈ క్రమంలో సినిమా బాలేదని నెగెటివ్‌ రివ్యూ ఇచ్చిన ఇద్దరినీ చెన్నైలో చితక్కొట్టారు.

సోషల్‌ మీడియా ప్రచారం ఎలా ఉన్నా మౌత్‌ టాక్‌తో సినిమాకు లాభాల పంట పండటం ఖాయంగా కనిపిస్తోంది. జైలర్‌ సినిమా విషయానికి వస్తే.. ఇందులో మోహన్‌ లాల్‌, శివ రాజ్‌కుమార్‌, యోగిబాబు, రమ్యకృష్ణ తమన్నా, సునీల్‌, జాకీ ష్రాఫ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించాడు. ఇతడి సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు తెలుస్తోంది.

చదవండి: జేమ్స్‌బాండ్‌లా పోజు కొడుతున్న ఈ స్టార్‌ హీరోను గుర్తుపట్టారా?

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)