Breaking News

జైలర్‌ 2 పూర్తి

Published on Wed, 04/22/2026 - 01:37

రజనీకాంత్‌  హీరోగా నటిస్తున్న ‘జైలర్‌ 2’ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి చిత్రం ‘జైలర్‌’. రమ్యకృష్ణ, సునీల్, తమన్నా, వసంత్‌ రవి, మిర్నా మీనన్, యోగి బాబు కీలక  పాత్రలు  పోషించారు. సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ నిర్మించిన ‘జైలర్‌’ సినిమా 2023 ఆగస్టు 10న విడుదలై తమిళంతో  పాటు  తెలుగులోనూ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. రజనీకాంత్‌–నెల్సన్‌ కాంబినేషన్‌లోనే ‘జైలర్‌’కి సీక్వెల్‌గా ‘జైలర్‌ 2’ చిత్రం రూపొందింది. ఈ సీక్వెల్‌లో రమ్యకృష్ణ, మిర్నా మీనన్, ఎస్‌జే సూర్య, యోగిబాబు కీలక  పాత్రలు  పోషించారు.

‘జైలర్‌’ మూవీని నిర్మించిన సన్‌ పిక్చర్స్‌ అధినేత కళానిధి మారన్‌ ‘జైలర్‌ 2’ని కూడా నిర్మించారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు తెలుపుతూ చిత్రయూనిట్‌ కొన్ని ఫొటోలు విడుదల చేసింది. షూటింగ్‌ పూర్తయిన సందర్భంగా రజనీకాంత్‌–నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ కేక్‌ కట్‌ చేసి, ఒకరికొకరు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా యూనిట్‌ సభ్యులు కూడా పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మిథున్  చక్రవర్తి, మోహన్  లాల్, శివ రాజ్‌కుమార్, విజయ్‌ సేతుపతి వంటి వారు ‘జైలర్‌ 2’లో అతిథి  పాత్రల్లో కనిపించనున్నారట. ఈ చిత్రాన్ని జూన్  12న విడుదల చేయనున్నట్లు యూనిట్‌ ప్రకటించింది.

Videos

సిక్సర్ల యుద్ధం అభిషేక్ ను భయపెడుతున్న బుడ్డోడు

మాజీ ఎమ్మెల్యే వర్మకు చంద్రబాబు షాక్‌

అక్షయ తృతీయ: ఒక్క రోజే రూ.20,000 కోట్ల బంగారం కొనుగోలు

5000 ఎకరాల దేవుడి భూమి స్వాహా చేసిన దేవాదాయ శాఖ కమిషనర్

బాబు పాలనపై బుగ్గన సెటైర్లు పెద్దిరెడ్డి నవ్వులు..

రాయలసీమ ఎత్తిపోతల ఆపేసి.. మన డబ్బంతా తీసుకెళ్లి అమరావతిలో పెడుతున్నారు

ఏ స్కూల్ మనది.. బుర్ర ఉందా కొల్లు రవీంద్ర ని ఏకిపారేసిన పేర్ని కిట్టు

గెలిపించిన మమ్మల్నే కొడతారా పిఠాపురం వర్మ ఫైర్

చిల్లర రాజకీయాలు మానుకో.. రేవంత్ పై హరీష్ ఘాటు వ్యాఖ్యలు

హనీ ట్రాప్ కలకలం పోలీసులే దగ్గరుండి.. సంచలన ఆడియో లీక్

Photos

+5

రానా సతీమణి మిహికా బజాజ్ ఆర్ట్‌ షో.. సందడి చేసిన టాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

పులివెందులలో వైఎస్‌ జగన్‌ పర్యటన.. భారీగా జన సందోహం (ఫొటోలు)

+5

ప్రకృతి ఒడిలో అనసూయ సమ్మర్ చిల్ (ఫొటోలు)

+5

తస్సాదియ్యా.. సమంత ఇంత సింపుల్‌గా ఉందేంటి! (ఫొటోలు)

+5

కాబోయే భార్యతో కలిసి కాశీకి రింకూ సింగ్‌ (ఫొటోలు)

+5

నేటి నుండి కేదార్‌నాథ్‌ దర్శనం.. భారీగా భక్తులు (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉన్న ఈ అద్భుతమైన శివాలయం గురించి తెలుసా మీకు? (ఫోటోలు)

+5

'వాలా 2' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తేజా సజ్జా సందడి (ఫొటోలు)

+5

వైఎస్‌ జగన్‌ పులివెందుల పర్యటన (ఫోటోలు)

+5

SRH vs DC : ఉప్పల్‌ స్టేడియంలో ఆరెంజ్‌ ఆర్మీ, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)