Breaking News

జైలర్‌– 2 ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

Published on Tue, 11/04/2025 - 06:51

నటుడు రజనీకాంత్‌( Rajinikanth) హీరోగా నటించిన చిత్రం జైలర్‌. నెల్సన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు వసంత్‌ రవి,రమ్యకృష్ణ, యోగిబాబు, సునీల్‌ తదితరులు ముఖయ పాత్రలు పోషించారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్, జాకీష్రాప్‌ తదితర స్టార్స్‌ అతిథి పాత్రల్లో మెరిన ఈ చిత్రంలో నటి తమన్న ఐటమ్‌ సాంగ్‌లో నటించారు. 2023లో తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. దీంతో తాజాగా జైలర్‌ 2 చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ చిత్ర షూటింగ్‌ పలు ప్రదేశాలో జరుపుకుంది. చివరిగా గోవాలో చిత్రీకరణను జరుపుకుంది. ఇందులో పాల్గొన్న రజనీకాంత్‌ తన షూటింగ్‌ను పూర్తి చేసుకుని తాజాగా చెన్నైకి తిరిగి వచ్చారు. 

ఆయన్ని చెన్నై విమానాశ్రయంలో పలువురు అభిమానులు కలిసి ఫొటోలు దిగారు. కాగా రజనీకాంత్‌ తదుపరి సుందర్‌.సీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారనే ప్రచారం జరుగుతోంది. ఈయన చాలా కాలం క్రితం సుందర్‌.సీ దర్శకత్వంలో నటించిన అరుణాచలం చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీంతో తాజాగా మరోసారి ఈ కాంబోలో చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది వినోదాన్ని మేళవించిన కమర్షియల్‌ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. 

కాగా ఈ చిత్రం తరువాత రజనీకాంత్, కమలహాసన్‌ కాంబోలో చిత్రం తెరకెక్కుతుందని తెలిసింది. దీన్ని రజనీకాంత్‌ ,కమలహాసన్‌ల వారుసురాళ్లు, సౌందర్య రజనీకాంత్, శృతీహాసన్‌ కలిసి నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ క్రేజీ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను కమలహాసన్‌ పుట్టిన రోజు అయిన ఈ నెల 7న రజనీకాంత్‌ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ ప్రకటన కోసం ఈ ఇద్దరు స్టార్స్‌ హీరోలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)