Breaking News

విజయ్‌తో కాదు...నాతో నాకే పోటీ

Published on Sun, 01/28/2024 - 00:41

‘‘నాకు, విజయ్‌కు మధ్య పోటీ లేదు. తనకు తానే పోటీ అని విజయ్‌ అంటుంటాడు. నేనూ అంతే. నాకు పోటీ నేనే’’ అన్నది రజనీకాంత్‌ లేటెస్ట్‌ స్టేట్మెంట్‌. ‘లాల్‌సలామ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో రజనీకాంత్‌ ఈ విధంగా మాట్లాడారు. దీనికి ఓ కారణం ఉంది. ‘జైలర్‌’ సినిమా ఆడియో ఫంక్షన్‌ వేదికగా రజనీకాంత్‌ ఓ డేగ, కాకి కథ చెప్పారు. ‘కాకులు ఎంత అరిచినా వాటి అరుపులు పట్టించుకోకుండా డేగ ఆకాశానికి ఎగురుతూనే ఉంటుంది’ అంటూ తన జర్నీని ఉద్దేశించి ఆ కథ చెప్పారు రజనీ.

దాంతో విజయ్‌ను ఉద్దేశించే ఆ కథ చెప్పారని కొందరు విజయ్‌ ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్‌ మీడియా వేదికగా అభ్యంతరకరమైన కామెంట్స్‌ చేశారు. ఈ విషయంపై తాజాగా చెన్నైలో జరిగిన ‘లాల్‌సలామ్‌’ ఆడియో లాంచ్‌ వేదికగా రజనీకాంత్‌ స్పందించారు. ‘‘జైలర్‌’ ఫంక్షన్‌లో నేను చెప్పిన కథ తప్పుగా ప్రచారంలోకి వెళ్లింది. విజయ్‌ని ఉద్దేశించే నేను ఆ కథ చెప్పానని ప్రచారం జరగడం బాధగా అనిపించింది.

‘ధర్మత్తిన్‌ తలైవన్‌’ సినిమా షూటింగ్‌ టైమ్‌లో విజయ్‌ తండ్రి చంద్రశేఖర్‌ నాకు అతన్ని పరిచయం చేసి, విజయ్‌ నటనపట్ల ఆసక్తిగా ఉన్నాడని చెప్పారు. చదువు పూర్తి చేశాక ఇండస్ట్రీలోకి రావాలని విజయ్‌కి సలహా ఇచ్చాను. తన చిన్నప్పట్నుంచి చూస్తున్నాను. ప్రతిభ, క్రమశిక్షణ, కష్టంతో విజయ్‌ పెద్ద స్టార్‌గా ఎదిగాడు. ఇకపై మా ఇద్దరి మధ్య పోటీ పెట్టొద్దని ఫ్యాన్స్‌ని కోరుతున్నాను’’ అన్నారు. ఇక ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన ‘లాల్‌ సలామ్‌’ ఫిబ్రవరి 9న రిలీజ్‌  కానుంది.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)