భారీ రేటుకు రజనీకాంత్‌ ‘కూలీ’ ఓటీటీ డీల్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Published on Sat, 03/15/2025 - 16:36

రజనీకాంత్‌(Rajinikanth) హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కూలీ’ (Coolie). ఈ చిత్రంలో నాగార్జున, ఉపేంద్ర, శ్రుతీహాసన్‌ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్‌ కెరీర్‌లో ఇది 171వ చిత్రం. 'ఖైదీ', 'విక్రమ్', 'లియో' వంటి చిత్రాల తర్వాత లోకేష్ కనగరాజ్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.  

ఈచిత్రం ఎప్పుడు విడుదలవుతుందా? అని రజినీకాంత్ ఫ్యాన్స్ తో పాటు ఇండియన్ ఆడియెన్స్ తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్పటికైతే ఈ మూవీ విడుదల తేదీని మేకర్స్ ఖరారు చేయలేదు. కానీ..అప్పుడే డిజిటల్‌ రైట్స్‌ అమ్ముడుపోయాయట.

ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ రైట్స్ ను ఇప్పటికే ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం. పలు ఓటీటీ సంస్థలు ఈ మూవీ డిజిటల్‌ రైట్స్‌ కోసం పోటీ పడ్డాయట. చివరకు ప్రైమ్‌ వీడియో రూ.120 కోట్లకు ఓటీటీ రైట్స్‌ కొనుగోలు చేసినట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. 

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఆమిర్‌ ఖాన్‌ కూడా ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది మే లేదా జూన్‌లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)