జస్టిస్‌ హేమ కమిటీపై 'రజనీకాంత్‌' రియాక్షన్‌.. నెటిజన్లు ఫైర్‌

Published on Sun, 09/01/2024 - 16:58

మలయాళ  చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జస్టిస్‌ హేమ కమిటీ ఒక నివేదికను ఇచ్చిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కమిటీ రిపోర్ట్‌పై రజనీకాంత్‌ చేసిన కామెంట్‌ విమర్శలకు దారితీస్తుంది.  మలయాళ పరిశ్రమలో మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కుంటున్నారని హేమ కమిటీ రిపోర్ట్‌లో తేలింది. దీంతో చాలామంది బాధితులు తమ బాధను తెలిపేందుకు ముందుకొచ్చారు. నిందితులపై కేసులు కూడా నమోదు అయ్యాయి. అయితే, తాజాగా కోలీవుడ్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రియాక్ట్‌ అయ్యారు

తాజాగా రజనీకాంత్‌ మీడియాకు కనిపించడంతో జస్టిస్‌ హేమా కమిటీపై స్పందించమని వారు కోరారు. ఈ విషయం గురించి తనకు ఎంత మాత్రమూ తెలియదంటూనే సారీ..! అని బదులిచ్చారు. రజనీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం గురించి రజనీ స్పందించకపోవడం ఏంటి..? అంటూ అభిమానులు కూడా మండిపడుతున్నారు. రజనీ లాంటి స్టార్‌ హీరోలే ఇలాంటి అంశంపై రియాక్ట్‌ కాకుంటే ఎలా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.  రజనీ.. మీరు గజినీలా మారకండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

తన తదుపరి చిత్రం 'వేట్టైయాన్‌' అక్టోబర్‌ 10న విడుదల కానుందని రజనీ తెలిపారు. ఆపై థాంక్యూ 'సూర్య' అంటూ 'కంగువా' సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరారు. వాస్తవంగా కంగువా కూడా అక్టోబర్‌ 10న విడుదల కావాల్సి ఉంది. అయితే, రజనీతో పోటీకి దిగడం లేదని సూర్య ప్రకటించడంతో కంగువా దాదాపు వాయిదా పడినట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు రజనీ కంగువా గురించి ప్రస్తావించారని సమాచారం.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)