Breaking News

32 ఏళ్ల తర్వాత మిత్రుడితో నటించేందుకు రెడీ అయిన రజినీ?

Published on Sat, 06/10/2023 - 17:28

భారతీయ సినిమా రంగంలో ఇద్దరు దిగ్గజాలు 32 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనున్నారని కోలీవుడ్‌లో ప్రచారం జరుగుతుంది. సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ 170వ చిత్రంలో బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్ బచ్చన్ నటించనున్నారనేది ఇప్పుడు వైరల్‌ అవుతుంది. వీటికి ప్రధాన మూలం తన 170వ సినిమాకు 'జై భీమ్' ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నారని రజనీ ప్రకటించడమే. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు కూడా ఆయన తెలిపాడు.  

(ఇదీ చదవండి: కాబోయే తోడి కోడలికి ఉపాసన గ్రాండ్ వెల్‌కమ్!)

జైలర్ తర్వాత షూటింగ్‌ పనులు కూడా ప్రారంభమవుతాయని దర్శకుడు ప్రకటించాడు.  దీంతో నటీనటుల ఎంపికపై రోజుకో వార్త వస్తుంది. ఈ స్టార్స్‌ కలిసి తక్కువ సినిమాల్లో కనిపించినా.. వారి మధ్య మంచి స్నేహం, సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ ప్రచారం నిజం కావచ్చనడంలో సందేహం లేదు. మూడు దశాబ్దాల క్రితం హమ్, అంధ కానూన్, వంటి చిత్రాలతో  బ్లాక్ బస్టర్ హిట్‌లను ఈ దిగ్గజ నటులు అందించిన విషయం తెలిసిందే.

యదార్థ సంఘటనలే కథకు మూలం 

రజినీ కాంత్‌ 170 ఫిల్మ్‌  యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందించబడుతున్నట్లు సమాచారం. ఇందులో పోలీసు ఆఫీసర్‌గా ఆయన నటించనున్నారట. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనున్న ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. 2024 చివరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ఇదీ చదవండి: సమంత నవ్వులు.. మృణాల్‌ బోల్డ్‌ క్యాప్షన్‌)

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)