Breaking News

Drugs Case: పోలీసు కస్టడీకి కేపీ చౌదరి.. సినిమా వాళ్లతో లింకులు ఉన్నాయా?

Published on Thu, 06/22/2023 - 13:02

డ్రగ్స్‌ రాకెట్‌లో ఇటీవల అరెస్ట్‌ అయిన సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్‌ కేపీ చౌదరి అలియాస్‌ కృష్ణప్రసాద్‌ను రాజేంద్రనగర్‌ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు కేపీ చౌదరిని చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించిన పోలీసులు..తమదైన శైలీలో విచారణ చేస్తున్నారు.

గోవా నుంచి డ్రగ్స్ తరలిస్తుండగా  కేపీ చౌదరి పోలీసులుకు పట్టుబడిన సంగతి  తెలిసిందే.  ఈ క్రమంలో అతన్ని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. వారం రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్‌ వేశారు. విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు.. రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పోలీసులు ఈరోజు కేపీ చౌదరిని చర్లపల్లి జైలు నుంచి రాజేంద్రనగర్‌ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.

(చదవండి: ఆ ఫోటోలు నావి కావు. . నాకు ట్వీటర్‌ ఖాతానే లేదు: జయవాణి)

సినీ ప్రముఖులతో కేపీ చౌదరికి ఏమైనా లింకులు ఉన్నాయా? డ్రగ్స్‌ని ఇప్పటివరకు ఎవరెవరికి విక్రయించారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. .ఈరోజు, రేపు.. కేపీ చౌదరిని పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నించనున్నారు. విచారణలో కేపీ చౌదరి ఇచ్చే సమాచారం ఆధారంగా డ్రగ్స్‌ వాడిన సెలబ్రిటీలకు పోలీసులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 

టాలీవుడ్‌తోపాటు కోలీవుడ్‌ సినీ ప్రముఖులతో పరిచయం ఉన్న కే.పీ.చౌదరి ‘కబాలి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)