Breaking News

సుష్మిత సంపాదిస్తుంటే తేరగా తింటున్నావ్‌.. ఇల్లు కూడా నీది కాదు!

Published on Mon, 06/09/2025 - 17:53

ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలకు ప్రశంసల కన్నా విమర్శలే ఎక్కువగా వస్తున్నాయి. సుష్మితా సేన్‌ (Sushmita Sen) సోదరుడు, బాలీవుడ్‌ నటుడు రాజీవ్‌ సేన్‌ (Rajeev Sen) కూడా అందుకు అతీతుడు కాదు. అక్క ఎలాగో పెళ్లి చేసుకోలేదు.. ఆమె బాగా సంపాదిస్తుంటే తేరగా వచ్చిందని పుష్టిగా తింటున్నావ్‌.. ఎంజాయ్‌ చేస్తున్నావ్‌ అని కొందరు అతడిపై నోరు పారేసుకున్నారు.

అక్క సంపాదనతోనే..
ఈ నెగెటివ్‌ కామెంట్లు రాజీవ్‌ కంటపడ్డాయి. అతడి కష్టాన్ని గుర్తించకపోగా ఇలా తక్కువ చేసి మాట్లాడటంతో నటుడి మనసు చివుక్కుమంది. దీంతో తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు. రాజీవ్‌ సేన్‌ మాట్లాడుతూ.. నా ఫ్యామిలీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను. అయితే మా అక్క సంపాదించే డబ్బుతోనే బతుకుతున్నానని, మా అమ్మానాన్న వల్లే ఇంత విలాసవంతమైన ఇంట్లో నివసిస్తున్నానని చాలామంది అనేక రకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. మీ అందరికీ ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను.

అలాగైతేనే సక్సెస్‌ అయినట్లా?
నేనేంటో చూపించుకోవడానికి నేనేమీ సూపర్‌స్టార్‌ అయిపోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు.. నేను పది సినిమాలు చేశాను, ఎన్నో యాడ్స్‌లో నటించాను.. ఇంకా నా చేతిలో ఫలానా ప్రాజెక్టులున్నాయి. వాటితో మరింత సక్సెస్‌ అవుతా.. ఇలాంటివి చెప్తేనే, చేస్తేనే సక్సెస్‌ అయినట్లు కాదు. చాలామంది బిజినెస్‌ పెట్టి సక్సెస్‌ అవుతున్నారు. రకరకాల విభాగాల్లో ఇన్వెస్ట్‌ చేసి డబ్బు సంపాదిస్తున్నారు. అవన్నీ కెమెరా ముందుకు వచ్చి చెప్పుకుంటారా? లేదు కదా! 

నగల బిజినెస్‌
నాకు జ్యువెలరీ బిజినెస్‌ ఉంది. అమ్మానాన్నల సహకారంతో అది విజయవంతంగా రన్‌ చేస్తున్నాను. నేను కాస్త ఉన్నత కుటుంబంలోనే పుట్టాను. అయినా నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అందుకే నగల వ్యాపారం ప్రారంభించాను. ఈ పని చాలాకాలంగా చేస్తున్నాను. ఇదే కాకుండా నటనవైపు వెళ్లాను, నిర్మాతగా కూడా ప్రాజెక్టులు చేస్తున్నా.. యూట్యూబ్‌ ఈ మధ్యే మొదలుపెట్టాను. ఇవన్నీ ప్యాషన్‌తో చేస్తున్నవే తప్ప డబ్బు సంపాదించడానికి చేయట్లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే సక్సెస్‌ఫుల్‌ ఇన్వెస్టర్‌ను. నా సొంత పెట్టుబడితో చాలానే సంపాదించా.. అది ఎంత మొత్తమనేది మీకు చూపించాల్సిన అవసరం లేదు.

గెంటేస్తే పోతా..
నేను ఉండే ఇల్లు మా అమ్మదే.. ఈ ఇల్లు నాదే అని ఎన్నడూ చెప్పలేదే! రేప్పొద్దున అమ్మ.. వెళ్లిపో అని గెంటేస్తే తప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తా! ఎందుకంటే నేను సంపాదించినవి మాత్రమే నా ఆస్తులు. ఇది నాది కాదు. అయినా మీరన్నట్లు మా అమ్మ సంపాదించిన విలాసవంతమైన ఇంట్లో ఉండి.. ప్రతి ఖర్చులు తనే భరిస్తూ.. మా అక్క కూడా తనే డబ్బిచ్చి ఎంజాయ్‌ చేయమంటే మీకేంటి సమస్య? నేనేం మీ జేబులోని డబ్బు తీయట్లేదుగా? మీరేమనుకున్నా నాకు ఫరఖ్‌ పడదు అని రాజీవ్‌ సేన్‌ ట్రోలర్స్‌కు కౌంటర్‌ ఇచ్చాడు.

చదవండి: అఖిల్‌ అక్కినేని రిసెప్షన్‌.. కొత్త జంట చేసిన పని చూశారా?

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)