Breaking News

ఫుడ్‌ పాయిజన్‌.. ఆస్పత్రిలో.. అందుకే లావయ్యా: రాజీవ్‌ కనకాల

Published on Fri, 01/05/2024 - 10:39

ప్రముఖ నటుడు రాజీవ్‌ కనకాల.. టాలీవుడ్‌లో అనేక సినిమాల్లో నటించాడు. చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్‌ చిత్రాల వరకు అన్నింటినీ కవర్‌ చేశాడు. సై, స్టూడెంట్‌ నెం.1, ఎ ఫిలిం బై అరవింద్‌, విక్రమార్కుడు, రంగస్థలం, నాన్నకు ప్రేమతో, ఆర్‌ఆర్‌ఆర్‌.. ఇలా ఎన్నో వైవిధ్య చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇండస్ట్రీలో అందరివాడు అనిపించుకున్న రాజీవ్‌ కనకాల గతకొంతకాలంగా కొద్దిగా లావయ్యాడు.

రోజూ రాత్రి పావుకిలో పైనే స్వీట్స్‌..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో తను లావవడం వెనక గల కారణాన్ని బయటపెట్టాడు. రాజీవ్‌ మాట్లాడుతూ.. 'ఆ మధ్య నాకు ఫుడ్‌ పాయిజన్‌ అయింది. ఆస్పత్రిలో జాయిన్‌ అయితే సెలైన్స్‌ ఎక్కించారు, యాంటిబయాటిక్స్‌ ఇచ్చారు. అప్పుడు ఆస్పత్రిలో ఫుడ్‌ ఇచ్చేవారు, అటు ఇంటి నుంచి ఆహారం వచ్చేది. ఏదీ వృథా చేయకూడదన్న ఉద్దేశ్యంతో అంతా తినేసేవాడిని. డిశ్చార్జ్‌ అయి ఇంటికి వచ్చాక రోజూ రాత్రి స్వీట్స్‌ తినాలనిపించేది. పావు కిలో నుంచి అరకిలో వరకు రోజూ స్వీట్స్‌ లాగించాను. అలా తెలియకుండానే బరువు పెరిగాను.

కాలు బెణికి నడవలేకపోయా..
ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా వరంగల్‌లో క్రికెట్‌ ఆడాను. ఆ సమయంలో కాలు బెణికింది. దీనికి తోడు లావు పెరగడంతో సరిగా నడవలేకపోయాను. నేను తినేటప్పుడు ఎవరైనా చాలు, ఆపేయని చెప్తే మాత్రం చాలా కోపమొస్తుంది. అందుకని నేను తినేటప్పుడు వద్దని దాదాపు ఎవరూ చెప్పరు. ప్రస్తుతం బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నాను' అని తెలిపాడు రాజీవ్‌ కనకాల. కాగా రాజీవ్‌- యాంకర్‌ సుమ తనయుడు రోషన్‌ కనకాల 'బబుల్‌గమ్‌' సినిమాతో ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే!

చదవండి: ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ లేపుతున్న ఫ్లాప్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)