Breaking News

సుమతో విబేధాలు? అందుకే అలా చేస్తున్నా: రాజీవ్‌ కనకాల

Published on Sat, 07/22/2023 - 16:23

బుల్లితెరపై యాంకర్‌ సుమ స్టార్‌.. వెండితెరపై రాజీవ్‌ కనకాల ఓ చిన్నపాటి స్టార్‌. వీరిద్దరి జంట చూడముచ్చటగా ఉంటుంది. కానీ ఎందుకో మరి గతంలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. సంపాదన విషయంలోనూ అభిప్రాయబేధాలు వచ్చాయని పుకార్లు షికార్లు చేశాయి. అదంతా ఏమీ లేదని చెప్పినా వీరి గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజీవ్‌ కనకాల తన వైవాహిక జీవితం గురించి, ఆర్థిక ఇబ్బందుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

చనిపోతాను అనగానే బాధ్యత తీసుకున్నా
'మా అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు. చెన్నైలో సినిమా ఇన్‌స్టిట్యూట్‌ పెడుతున్నారనగానే జాబ్‌ మానేసి అక్కడికి వెళ్లిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికే ఇన్‌స్టిట్యూట్‌ మూసేశారు. అమ్మ మళ్లీ రాష్ట్ర ఉద్యోగం కొట్టింది. నాన్న నటుడిగా నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ గుర్తింపు పొందాడు. తర్వాత ఆయన దర్శకుడిగా మారి సినిమాలు తీశాడు. 1985లో సొంతంగా ఇన్‌స్టిట్యూట్‌ పెట్టుకున్నాం. అప్పటినుంచి వరుసగా కష్టాలే! ఎప్పుడూ డబ్బులుండేవి కాదు. రూ.100, రూ.500 కోసం కూడా అప్పు చేయాల్సి వచ్చింది. అదే సమయంలో నాన్నకు వారి సోదరులతో కలహాలు వచ్చాయి. వీటన్నింటిని తట్టుకోలేకపోయిన ఆయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నా అన్నాడు. నేనున్నా కదా నాన్న అని సర్ది చెప్పి పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్నా. వచ్చిన అవకాశాలన్నీ చేసుకుంటూ పోయాను.

సుమతో విబేధాలు.. అందుకోసమే అలా చేస్తున్నా
కంటి మీద కునుకు లేకుండా వరుస సీరియల్స్‌ చేసేవాడిని. పెళ్లయిన తర్వాత ఇద్దరం కలిసి అప్పులు అంతా తీర్చేశాం. మధ్యలో ఒకసారి ఓ సీరియల్‌కు డైరెక్షన్‌ చేశాను. ఏడాదిదాకా ఏ సినిమా ఛాన్సూ రాలేదు. అందుకే నేను నటనకే అంకితమయ్యాను. సుమ, నేను సంతోషంగా ఉన్నాం. మా మధ్య దూరం పెరిగిందని లేనిపోనివి రాస్తున్నారు. ఇలాంటి వాటికి చెక్‌ పెట్టేందుకే అప్పుడప్పుడూ తన ప్రోగ్రామ్‌లకు హాజరవుతున్నాను. కలిసి రీల్స్‌ కూడా చేస్తున్నాం. ఈ విడాకుల రూమర్స్‌ విని నేను బాధపడ్డాను. కానీ సుమ అయితే ఏమాత్రం పట్టించుకోలేదు. తర్వాత నేను కూడా లైట్‌ తీసుకోవడం మొదలుపెట్టాను' అని చెప్పుకొచ్చాడు రాజీవ్‌ కనకాల.

చదవండి: అందుకే సౌత్‌ను పట్టించుకోను.. అక్కడ హీరో, దర్శకుడు కాంప్రమైజ్‌ అడిగారు: నటి
రెండో భార్యతో కలిసి తిరుమలను దర్శించిన ప్రభుదేవా

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)