Breaking News

సొంత ఊరి జ్ఞాపకాలు గుర్తొస్తాయి: రాజీవ్‌ కనకాల

Published on Fri, 04/04/2025 - 03:17

రాజీవ్‌ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్‌ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌ సిరీస్‌ ‘హోమ్‌ టౌన్‌’. శ్రీకాంత్‌ రెడ్డి పల్లే దర్శకత్వంలో నవీన్‌ మేడారం, శేఖర్‌ మేడారం నిర్మించిన ఈ సిరీస్‌ నేటి నుంచి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. కాగా ఈ సిరీస్‌ ప్రివ్యూను హైదరాబాద్‌లో ప్రదర్శించారు.

ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ– ‘‘హోమ్‌ టౌన్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సిరీస్‌ ప్రివ్యూ చూసిన వారిలో కొందరికి తమ సొంత ఊరు, మరికొందరికి తమ గత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి ఉంటాయి. ఈ సిరీస్‌లో పిల్లల అల్లరి చూస్తుంటే 35 ఏళ్లు వెనక్కి వెళ్లిన ఫీలింగ్‌ కలిగింది. నవీన్‌ మేడారంగారు ఈ సిరీస్‌కు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. నాతో కలిసి నటించిన ఝాన్సీగారికి, ఇతర టీమ్‌ కి ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. 

‘‘90స్‌: ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ తర్వాత మా సంస్థలో చేసిన వెబ్‌ సిరీస్‌ ‘హోమ్‌ టౌన్‌’.‘90స్‌: ఎ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ సిరీస్‌లో నటించిన ఆ ముగ్గురు పిల్లలు ఓవర్‌ నైట్‌ స్టార్స్‌ ఎలా అయ్యారో, ‘హోం టౌన్‌’ సిరీస్‌ స్ట్రీమింగ్‌ తర్వాత ఈ ముగ్గురు పిల్లలకు కూడా అంతే పేరు వస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు నవీన్‌ మేడారం.

‘‘సొంతూరుతో ముడిపడిన జ్ఞాపకాలను మర్చిపోలేం. అలాంటి భావోద్వేగాలు ఈ ‘హోమ్‌ టౌన్‌’ వెబ్‌ సిరీస్‌లో ఉంటాయి. సిరీస్‌లోని అందరు వారి బెస్ట్‌ పెర్ఫార్మెన్స్‌లు ఇచ్చారు. అవకాశం ఇచ్చిన నిర్మాత నవీన్, ఆహాకు థ్యాంక్స్‌’’ అని తెలిపారు శ్రీకాంత్‌రెడ్డి పల్లే. ఈ కార్యక్రమంలో ప్రజ్వల్‌ యాద్మ, సాయిరామ్, అనిరుధ్, అనీ, శ్రావ్య, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సురేష్‌ బొబ్బిలి మాట్లాడారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)