Breaking News

రాజ్‌తరుణ్‌ పేరెంట్స్‌ను ఇంట్లోకి రానిచ్చిన లావణ్య

Published on Thu, 04/17/2025 - 14:16

సాక్షి, హైదరాబాద్‌: కోకాపేటలోని రాజ్‌తరుణ్‌ ఇంటివద్ద జరిగిన హైడ్రామాకు తెరపడింది. రాజ్‌ తరుణ్‌ (Raj Tarun) తల్లిదండ్రులను ఇంట్లోకి రానివ్వని లావణ్య నేడు (ఏప్రిల్‌ 17) ఉదయం మనసు మార్చుకుంది. వారు ఇంట్లోకి వచ్చేందుకు ఓకే చెప్పింది. దీంతో రాజ్‌తరుణ్‌ పేరెంట్స్‌ను పోలీసులు ఇంట్లోకి పంపించారు. కాగా సూరారంలో ఉంటున్న రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులు అక్కడ అద్దె ఇంట్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కుమారుడి ఇంటికి వచ్చారు.

తీరా వచ్చి చూస్తే ఆ ఇంట్లో లావణ్య ఉంటోంది. వారిని లోపలకు రానివ్వకుండా అడ్డుకుంది. అంతేకాకుండా రాజ్‌తరుణ్‌ పేరెంట్స్‌ పదిమందితో వచ్చి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను గెంటేయడానికే వచ్చారని ఆరోపించింది. దీంతో రాజ్‌తరుణ్‌ తల్లిదండ్రులు ఇంటి బయటే ఉండిపోయారు. కొడుకు కష్టార్జితంతో కొన్న ఇంట్లోకి రానివవడం లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు. పోలీసుల జోక్యంతో వారు విల్లాలో అడుగుపెట్టారు.

ఆడియో కాల్‌ వైరల్‌
ఇదిలా ఉంటే రాజ్‌తరుణ్‌, లావణ్య, అరియానా గ్లోరీ ఫోన్‌ కాల్‌ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. అందులో అరియానా.. నా ఇంట్లో నేను చెప్పేశా.. ఈ అబ్బాయి మన ఫ్యామిలీ మెంబర్‌. ఇకపై నాతోనే కలిసి జీవిస్తాడని చెప్పాను. మరి నీ లైఫ్‌లో నేనేంటో చెప్పు? అని రాజ్‌తరుణ్‌ను నిలదీసింది. అతడు నీకు ఫ్రెండ్‌గా ఉంటాడని లావణ్య అంటుంటే.. నాకు ఫ్రెండ్‌ కాదు, ఫ్రెండ్‌ కంటే ఎక్కువ అని అరియానా పేర్కొంది. ఫ్రెండ్‌ కాకపోతే మీ మధ్య ఏముందో చెప్పండి. రిలేషన్‌లో ఉన్నారా? ప్రేమలో ఉన్నారా? పెళ్లి చేసుకుంటారా? ఏంటో చెప్పండి అని లావణ్య నిలదీసింది. దానికి మాత్రం అరియానా క్లారిటీ ఇవ్వలేదు.

చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్‌.. ఎక్కడంటే?

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)