Breaking News

అద్దె కట్టడానికి డబ్బు లేక 11 రోజులు ఫుట్‌పాత్‌పై నిద్ర

Published on Sat, 09/14/2024 - 17:05

ఒకప్పుడు రాజ్‌తరుణ్‌ క్రేజీ హీరో.. ఉయ్యాల జంపాల, కుమారి 21 ఎఫ్‌ చిత్రాలతో హిట్లు అందుకుని సెన్సేషన్‌ అయ్యాడు. కానీ తర్వాతే ట్రాక్‌ తప్పి ఫ్లాపులబారిన పడ్డాడు. ఈ మధ్య పురుషోత్తముడు, తిరగబడర సామీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా మళ్లీ అపజయాలే అందుకున్నాడు. తాజాగా  అతడు ప్రధాన పాత్రలో నటించిన భలే ఉన్నాడే సినిమా రిలీజైంది.

 అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా..
ఈ మూవీ ప్రమోషన్స్‌లో రాజ్‌ తరుణ్‌ తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదురైన కష్టాలను చెప్పుకొచ్చాడు. 'నన్ను ఎవరైనా గుర్తించి ఇండస్ట్రీకి పిలవాలని ఎదురుచూశాను. దాదాపు 52 షార్ట్‌ ఫిలింస్‌ చేశాక రామ్మోహన్‌గారు చూసి పిలిచారు. యాక్టింగ్‌ చేస్తావా? డైరెక్షన్‌ చేస్తావా? అని అడిగారు. నాకు డైరెక్షనే ఇష్టమని చెప్పాను. అలా ఆయన దగ్గర రూ.3000కు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా వర్క్‌ చేశాను.

వెళ్లిపోమన్నారు
ఉదయం నుంచి రాత్రి వరకు ఒక్క సీన్‌ గురించి చర్చించేవాళ్లం. అప్పుడు నేను పర్వాలేదు.. కానీ, ఇంకాస్త బాగుండాల్సింది అని దీర్ఘాలు తీశాను. నెల రోజులు ఓపిక పట్టాడు. తర్వాత ఆయనకు కోపం వచ్చి నువ్వుంటే స్క్రిప్ట్‌ ముందుకు సాగదు, వెళ్లిపో అన్నారు. ఏం చేయాలో తోచలేదు.

నీళ్లు తాగి కడుపు నింపుకున్నా
బీటెక్‌ మధ్యలో ఆపేసి వచ్చాను. అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేకపోవడంతో ఫుట్‌ఫాత్‌పై 11 రోజులపాటు పడుకున్నాను. నీళ్లు తాగి కడుపు నింపుకునేవాడిని. ఆ తర్వాత మళ్లీ రామ్మోహన్‌ గారే పిలిపించారు. అప్పుడు నాకు 20 ఏళ్లు! ఆ వయసులో ఒక ఫైర్‌ ఉంటుంది. ఏదైనా సాధించే తిరిగి వెళ్లాలనుకున్నాను. నా టాలెంట్‌ను నమ్ముకున్నాను. రైటర్‌గా ప్రమోషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత హీరోనయ్యాను అని చెప్పుకొచ్చాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)