Breaking News

'భార్య నిద్రపోగానే ఆమె చెల్లితో పార్టీకి వెళ్తా, తనకు పెళ్లి కాకూడదు'

Published on Fri, 07/28/2023 - 18:56

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా ఆ మధ్య పోర్నోగ్రఫీ కేసులో చిక్కుకున్న సంగతి తెలిసిందే! అప్పటినుంచి ఆయనపై వ్యతిరేకత బీభత్సంగా పెరిగిపోయింది. అటు రాజ్‌కుంద్రా కూడా మీడియాకు ముఖం చూపించడం ఇష్టం లేక మాస్కు ధరించే తిరుగుతున్నాడు. ఎప్పుడు బయట కనిపించినా ఏదో ఒక కొత్తరకం మాస్కుతోనే బయట దర్శనమిస్తున్నాడు. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా శిల్పా శెట్టిని పెళ్లి చేసుకున్నందుకు ఆమె చెల్లితో కలిసి పార్టీలకు తిరుగుతున్నానని గతంలో ఓ షోలో వెల్లడించాడు.

భార్య పడుకోగానే మరదలితో పార్టీ
తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రాజ్‌ కుంద్రా తన భార్య శిల్పా శెట్టి, మరదలు షమితా శెట్టితో కలిసి ఓ షోకి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'శిల్పా శెట్టిని చేసుకోవడం వల్ల నాకు చాలా కలిసొచ్చింది. పెళ్లైన కొత్తలో ఆమె చాలా పద్ధతిగా ఉండేది. పార్టీలు గట్రా నచ్చేవి కావు. రాత్రి 9 అవగానే నిద్రపోయేది. నాకు ఎప్పుడైనా పార్టీకి వెళ్లాలనిపిస్తే ఆమె చెల్లెలిని పిలిచేవాడిని. తను నో చెప్పకుండా తోడు వచ్చేది.

ఆమెకు త్వరగా పెళ్లి కాకూడదు
అందుకే ఎప్పుడైనా బయటకు వెళ్లాలంటే నా మైండ్‌లోకి ముందు షమిత పేరే వస్తుంది. అదే ఇంట్లో ఉండాలి, పుస్తకాలతో కాలక్షేపం చేయాలనుకున్నప్పుడు శిల్ప మదిలో మెదులుతుంది. అందుకే షమితాకు త్వరగా పెళ్లవాలని నేను కోరుకోను' అని చెప్పుకొచ్చాడు. కాగా శిల్పా శెట్టి, రాజ్‌ కుంద్రాల నిశ్చితార్థం 2009 ఫిబ్రవరిలో జరిగింది. అదే ఏడాది నవంబర్‌ 22న పెళ్లి చేసుకున్నారు.

శిల్పా శెట్టి వెండితెర ప్రయాణం
బాజీఘర్‌ సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేసిన శిల్పా శెట్టి 'సాహస వీరుడు సాగర కన్య' చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. వీడెవడండీ బాబు, ఆజాద్‌, భలేవాడివి బాసు అనే తెలుగు చిత్రాలు చేసింది. ఎక్కువగా హిందీ సినిమాలు చేస్తూ అక్కడే స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుండగా ఇండియన్‌ పోలీస్‌ ఫోర్స్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించనుంది.

చదవండి: పాలబుగ్గల పసివాడిని గుర్తుపట్టారా? మెగాస్టార్‌ వారసుడు.. దుబాయ్‌లో ఉద్యోగం వదిలి హీరోగా.. తెలుగులో సూపర్‌ క్రేజ్‌!

Videos

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)