Breaking News

'నా కిడ్నీల్లో ఒకటి మీదే'.. స్వామిజీకి హీరోయిన్ భర్త బంపరాఫర్!

Published on Fri, 08/15/2025 - 12:09

బాలీవుడ్‌లో ఎప్పుడు వివాదాల్లో ఉన్న జంట ఎవరైనా ఉన్నారంటే వాళ్లే. ఆ కపుల్‌ మరెవరో కాదు.. బాలీవుడ్ భామ శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా. గతంలో ఓ కేసుతో సంచలనంగా మారిన రాజ్ కుంద్రా.. మరో కేసులో చిక్కుకున్నారు. తనను రూ.60 కోట్ల మోసం చేశారంటూ రాజ్‌ కుంద్రా, శిల్పాశెట్టిపై ఓ వ్యాపారవేత్త ఫిర్యాదు చేశారు. దీంతో ముంబయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఇటీవల రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి కలిసి ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువైన ప్రేమానంద్‌ మహారాజ్‌కు ఏకంగా తన కిడ్నీని దానం చేస్తానని రాజ్ కుంద్రా మాటిచ్చారు. ఇది విని అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ వీడియోను ప్రేమానంద్ భజన్ మార్గ్ యూట్యూబ్‌ ఛానెల్‌లో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా రాజ్‌ కుంద్రాకు ప్రేమానంద్ ధన్యవాదాలు తెలిపారు. మథురలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని శిల్పాశెట్టి దంపతులు సందర్శించిన వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. వ్యాపారవేత్తను రూ.60 కోట్ల మోసం చేశారనే ఆరోపణలు వచ్చిన సమయంలో ఈ వీడియో బయటకి రావడం విశేషం.

రాజ్ కుంద్రా మాట్లాడుతూ.. 'నేను గత రెండేళ్లుగా మిమ్మల్ని అనుసరిస్తున్నా. నాకు ఏవైనా సందేహాలు, భయాలకు మీ వీడియోలు ఎల్లప్పుడూ సమాధానం ఇస్తాయి. ఇప్పుడు నాకు ఎటువంటి ప్రశ్నలు లేవు. మీరు అందరికీ ప్రేరణ. మీ ఆరోగ్య పరిస్థితి గురించి నాకు తెలుసు. అందుకే నేను సహాయం చేయగలిగితే నా రెండు కిడ్నీలలో ఒకటి మీదే." అని అన్నారు.

అయితే ప్రేమానంద్ మహారాజ్‌కు రెండు కిడ్నీలు చెడిపోయినట్లు తెలుస్తోంది. గత పదేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న రాజ్ కుంద్రా కిడ్నీ ఆఫర్ చేశారు. ఈ నిర్ణయం శిల్పాశెట్టిని ఆశ్చర్యానికి గురిచేసింది.

 

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)