Breaking News

6 ఏళ్ల తర్వాత పర్సనల్‌ ఫోటోలు బయటకు ఎలా వచ్చాయి?: రాహుల్‌

Published on Thu, 09/21/2023 - 10:08

బిగ్‌బాస్‌ హౌస్‌లో అతి చేస్తున్న కంటెస్టెంట్లు ఎవరైనా ఉన్నారా? అంటే చాలామంది పేర్లు వినిపిస్తాయి. అయితే అంతుచిక్కని ప్రవర్తనతో అపరిచితురాలిగా మారుతూ అందరినీ చిరాకు పెట్టే కంటెస్టెంట్లలో తొలిస్థానంలో ఉంటుంది రతిక. మొదట్లో అమ్మాయి బాగుంది, ఆటాడితే ఇంకా బాగుంటుంది అనుకున్నారంతా! తను కూడా అదే చేసింది.. కానీ బిగ్‌బాస్‌ ఇచ్చిన గేమ్‌ ఆడకుండా హౌస్‌మేట్స్‌తో ఆడింది. వారి సహనానికి పరీక్ష పెడుతూ మొండిగా ప్రవర్తిస్తూ ముప్పతిప్పలు పెట్టింది.

ఈ ఫేక్‌ సింపతీ గేమ్స్‌ ఎప్పటివరకు?
ఇప్పుడేమో హౌస్‌లో లవ్‌ ట్రాక్‌లు నడుపుతూ, వెనకాల వెన్నుపోటు పొడుస్తూ డబుల్‌ గేమ్‌ మొదలుపెట్టింది. ఇదంతా పక్కనపెడితే రతిక ఆ మధ్య తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ గుర్తొస్తున్నాడంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పదే పదే అతడి గురించే ప్రస్తావిస్తోంది. అతడు గుర్తొస్తే తన మైండ్‌ పని చేయడమే ఆగిపోతోందని చెప్పుకొచ్చింది. అతడు సింగర్‌ అని కూడా హింటిచ్చింది. చివరకు ఆ సింగర్‌ మరెవరో కాదు, రాహుల్‌ సిప్లిగంజ్‌ అంటూ నెట్టింట ఫోటోలు కూడా లీకయ్యాయి. తాజాగా దీనిపై రాహుల్‌ స్పందించిన సంగతి తెలిసిందే! ఈ ఫేక్‌ సింపతీ గేమ్స్‌ ఎప్పటివరకు? కొందరు పక్కనోళ్ల పేరు, ఫేమ్‌ ఉపయోగించుకోవాలని చూస్తుంటారు. వారి గుర్తింపు కోసం నా పేరును అవసరానికి మించి వాడుకుంటున్నారు అని మండిపడ్డాడు.

ముందే ప్లాన్‌ చేసుకున్నారా?
తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఫోటోలు లీక్‌ అవడంపైనా అనుమానం వ్యక్తం చేశాడు. 'నాకో డౌట్‌.. ఆరేళ్ల తర్వాత సడన్‌గా వారి పర్సనల్‌ ఫోన్‌లో ఉన్న ఫోటోలు ఇంటర్నెట్‌లోకి ఎలా వచ్చాయి? అంటే.. లోపలికి వెళ్లడానికి ముందే ఇదంతా ప్లాన్‌ చేసుకున్నారా? సమాధానమేంటో మీకే అర్థమవుతుందనుకుంటా! అక్కడున్నది అబ్బాయైనా, అమ్మాయైనా వారి జీవితాలతో నాకెటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు సక్సెస్‌ అయ్యేందుకు ఎంతగానో కష్టపడుతున్నారు.

ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది!
అలాంటిది.. ఇలా ఫోటోలు లీక్‌ చేసి ఇబ్బంది పెట్టేముందు క్షణం ఆలోచించాల్సింది. ఎదుటివ్యక్తి కుటుంబం, స్నేహితులు దీని వల్ల ఎంత ఎఫెక్ట్‌ అవుతారని ఆలోచించి ఉంటే బాగుండేది. ప్రతి ఒక్కరికి గతం, వర్తమానం అనేవి రెండూ ఉంటాయి. అసలేం జరిగిందో తెలియకుండా ఎవరిది తప్పు? ఒప్పు? అని డిసైడ్‌ చేయకండి. ఇది అర్థం చేసుకున్నవారికి థాంక్యూ.. లేదు, విషాన్ని చిమ్ముతామనుకునేవారికి ఆల్‌ ద బెస్ట్‌' అని రాసుకొచ్చాడు.

చదవండి: పేరు చెప్పకుండా సీరియస్ అయిన సింగర్ రాహుల్

Videos

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?