Breaking News

ఎమ్మెల్యేగా పోటీ అంటూ ఊహాగానాలు.. రాహుల్‌ సిప్లిగంజ్‌ క్లారిటీ

Published on Sat, 08/26/2023 - 12:21

ప్రముఖ సింగర్‌, బిగ్‌బాస్‌ విజేత రాహుల్‌ సిప్లిగంజ్‌ రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ గతకొద్ది రోజులుగా ప్రచారం ఊపందుకుంది. గోషామహల్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్‌ ఉందంటూ రూమర్స్‌ జోరందుకున్నాయి. తాజాగా ఈ ఊహాగానాలపై రాహుల్‌ స్పందించాడు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని క్లారిటీ ఇచ్చాడు.

నేను ఆర్టిస్ట్‌ను.. రాజకీయాలకు నో
'నా మీద చాలా పుకార్లు, ఆరోపణలు వస్తున్నాయి.. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. గోషామహల్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం లేదు. రాజకీయ రంగప్రవేశం అంటూ వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అన్ని పార్టీలలో ఉన్న అందరు నాయకులను నేను గౌరవిస్తాను. నేను ఒక ఆర్టిస్ట్‌ను.. అందరికీ వినోదం పంచడమే నా పని.. నా జీవితమంతా దానికే ధార పోస్తాను. అసలు నేను రాజకీయాల్లోకి వస్తున్నట్లు వార్తలు ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయో అర్థం కావడం లేదు.

ఇది మరీ టూమచ్‌..
నేను సంగీతాన్నే నా కెరీర్‌గా ఎంచుకున్నాను. ఇందులో చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఏ పార్టీ నాకు ఆహ్వానాలు పంపలేదు. నేను కూడా ఎవరినీ ప్రత్యేకంగా కలవలేదు. దయచేసి ఈ రూమర్స్‌ను ఇక్కడితో ఆపేయండి..' అని నోట్‌ షేర్‌ చేశాడు. 'పుకార్లు రావడం సాధారణమే.. కానీ ఈ పుకారు మాత్రం మరీ టూమచ్‌గా ఉంది' క్యాప్షన్‌లో రాసుకొచ్చాడు. దీంతో అతడి రాజకీయ అరంగేట్రం అంటూ వస్తున్న వార్తలకు తెరపడింది.

చదవండి: సిగరెట్‌, గంజాయి.. ఊహించనన్ని చెడు అలవాట్లు, నాన్న జేబులో డబ్బులు కొట్టేసేవాడిని.. కొట్టడం..

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)