హీరో కిరణ్ అబ్బవరంతో నిశ్చితార్థం.. హీరోయిన్ ఎమోషనల్ పోస్ట్

Published on Thu, 03/14/2024 - 21:50

తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నిశ్చితార్థం చేసుకున్నాడు. తనతో పాటు తొలి సినిమాలో హీరోయిన్‌గా చేసిన రహస్య గోరఖ్‌నే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయాడు. హైదరాబాద్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో కిరణ్-రహస్య ఉంగరాలు మార్చుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి టైంలో రహస్య.. కిరణ్‌తో ఆరేళ్ల ప్రేమ గురించి బయటపెట్టింది.

షార్ట్ ఫిల్మ్స్‌తో కెరీర్ మొదలు పెట్టిన కిరణ్ అబ్బవరం, రహస్య గోరఖ్.. 'రాజావారు రాణిగారు' సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీ తర్వాత రహస్య.. నటనని పక్కన పెట్టేసింది. కిరణ్ అబ్బవరం మాత్రం పలు చిత్రాల్లో నటించి హీరోగా కాస్తంత పేరు తెచ్చుకున్నాడు. అయితే వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారని చాలారోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. కాకపోతే ఇద్దరిలో వీటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. తాజాగా నిశ్చితార్థంతో వీళ్ల ప్రేమ నిజమేనని అందరికీ తెలిసింది. 

(ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?)

ఈ క్రమంలోనే తాజాగా కిరణ్-రహస్య నిశ్చితార్థం.. హైదరాబాద్‌లో మార్చి 13న జరిగింది. ఇది అయిన ఓ రోజు తర్వాత అంటే మార్చి 14న కిరణ్‌తో తన ప్రయాణం గురించి ఇన్ స్టా స్టోరీలో చెప్పుకొచ్చింది.

'ఆరేళ్లుగా నువ్వు నాకు తెలుసు. బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నాం. ప్రేమలో పడ్డాం. ఎన్నో ఊసులు చెప్పుకున్నాం. ప్లానింగ్ లేకుండానే ట్రిప్స్‌కి వెళ్లాం. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాం. ఏదైతేనేం మనది అద్భుతమైన జర్నీ. నీతోపాటు ఈ జర్నీని కొనసాగించేందుకు చాలా ఆత్రుతగా ఉన్నాను. నా సర‍్వస్వం కిరణ్ అబ్బవరం' అని రహస్య గోరఖ్ రాసుకొచ్చింది. అయితే వీళ్ల పెళ్లి ఈ ఏడాదిలోనే ఉండొచ్చని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)