Breaking News

హీరో అజిత్‌ను పేరు పెట్టి పిలిచా.. అందరూ షాకయ్యారు: నటుడు

Published on Thu, 03/20/2025 - 16:56

కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ (Ajith)ను పేరు పెట్టి పిలిచినందుకు అందరూ తనను గుర్రుగా చూశారంటున్నాడు నటుడు రఘురామ్‌. ఇతడు ప్రస్తుతం అజిత్‌ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్‌లో జరిగిన ఆసక్తికర విషయాన్ని తాజా ఇంటర్వ్యూలో వెల్లడించాడు. రఘురామ్‌ (Raghu Ram) మాట్లాడుతూ.. నేను పెరిగిందంతా ఢిల్లీలో.. ఉంటోంది ముంబైలో! అక్కడ మాకంటే పెద్ద స్థాయిలో ఉండేవారిని కూడా పేరు పెట్టే పిలుస్తాం. నాకూ అదే అలవాటైపోయింది.

తల కొట్టేసినట్లయింది
గుడ్‌బ్యాడ్‌ అగ్లీ సినిమా (Good Bad Ugly) షూటింగ్‌లో అజిత్‌ తనను తాను పరిచయం చేసుకున్నాడు. నన్ను నేను పరిచయం చేసుకునే క్రమంలో అతడి పేరు పెట్టి పిలిచాను. అందరూ షాకయ్యారు. సెట్‌ నిశ్శబ్దంగా మారిపోయింది. అలా పేరు పెట్టి పిలవడం ఆయన్ను అవమానించినట్లు కాదా అన్నారు. నాకు తల కొట్టేసినట్లుగా అనిపించింది. అంత పెద్ద హీరోతో కలిసి నటించే ఛాన్స్‌ వస్తే నేనిలా చేశానేంటి? అనుకున్నాను. స్పెయిన్‌లో షూటింగ్‌కు వెళ్లినప్పుడు దర్శకుడు, సహాయ దర్శకుడు కూడా అజిత్‌ను పేరు పెట్టి పిలవొద్దన్నారు. 

అందుకే అలా పిలుస్తున్నా..
సరే.. సర్‌ అని పిలుస్తానని చెప్పాను. సాధారణంగా ఆయన ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరనుకుంటాను. జనాలు ఇబ్బందిపడుతున్నారని నేనే ఆయన్ను సర్‌ అనడం మొదలుపెట్టాను అని చెప్పుకొచ్చాడు. రఘురామ్‌ ఝూఠా హై సహీ అనే చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయం య్యాడు. తీస్‌మార్‌ ఖాన్‌ మూవీలోనూ నటించాడు. తమిళంలో డాక్టర్‌, తెలుగులో గాంధీ తాత చెట్టు, మెకానిక్‌ రాకీ చిత్రాల్లో నటించాడు.

చదవండి: బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోట్‌ చేశాం.. సారీ చెప్పాం.. ఇంకేంటి? సురేఖావాణి ఫైర్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)