Breaking News

లారెన్స్ తన కూతురిని దాస్తున్నాడా? ఆయనకు అంత పెద్ద కూతురు ఉందా?

Published on Sat, 09/09/2023 - 13:40

కొరియోగ్రాఫర్‌గా కెరీర్ మొదలుపెట్టి, ప్రస్తుతం హీరోగా బిజీ అయిపోయాడు రాఘవ లారెన్స్. ఇతడు చేసిన కొత్త సినిమా 'చంద్రముఖి 2'. గతంలో రజనీకాంత్ చిత్రానికి ఇది సీక్వెల్. సెప్టెంబరు 28న థియేటర్లలోకి రానుంది. 1993లో డ్యాన్స్ కొరియోగ్రాఫర్‌గా అరంగేట్రం చేసిన ఆయన 1998లో తెలుగు సినిమాలో నటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. కాంచన సిరీస్‌లో విడుదలైన చిత్రాల ద్వారా సౌత్‌ ఇండియా ప్రేక్షకుల దృష్టిని లారెన్స్ ఆకర్షించాడు. సామాజిక సేవా విషయాల్లో ఎప్పుడూ ముందుండే వ్యక్తి లారెన్స్‌. నిరుపేద పిల్లలకు సహాయం చేసేందుకు ఆయన ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి పలు సేవలను అందిస్తున్నాడు.

(ఇదీ చదవండి: విశాల్‌ 'మార్క్‌ ఆంటోనీ' సినిమాపై బ్యాన్‌ విధించిన కోర్టు)

లారెన్స్ లాగే అతని తమ్ముడు ఎల్విన్ కూడా హీరోగా కోలీవుడ్ అరంగేట్రం చేయబోతున్నాడు. ఆయన సినిమా షూటింగ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. లారెన్స్ సినిమాలతో పాటు సోషల్ వర్క్ కూడా పెద్ద ఎత్తున చేస్తున్నాడు. అనాథ పిల్లలకు, వృద్ధులకు సహాయం చేయడంలో లారెన్స్ ముందుంటాడు. లారెన్స్ గురించి అందరికీ తెలుసుగానీ, అతని కుటుంబం గురించి ఎవరికీ పెద్దగా తెలిసే అవకాశం లేదు. లారెన్స్ భార్య పేరు లత. సామాజిక సేవ చేయడంలో భర్తకు అండగా నిలిచేది లత.

లతను పెళ్లి చేసుకున్న తర్వాతే తాను డ్యాన్స్ మాస్టర్‌గా ఎదిగానని, సినిమాల్లో ఇంత ఎత్తుకు ఎదిగానని, ఆమె వల్లే తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని లారెన్స్ ఇంటర్వ్యూలలో చెప్పాడు. లారెన్స్, లత దంపతులకు రాఘవి అనే కుమార్తె ఉంది. లారెన్స్‌కి ఓ కూతురు ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇప్పుడు రాఘవి సినిమాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు లారెన్స్‌ అభిమానుల్లో చర్చ జరుగుతోంది. లారెన్స్‌కి ఇంత పెద్దకూతురు ఉందంటే నమ్మలేకపోతున్నామని చాలామంది వ్యాఖ్యానిస్తున్నారు.

(ఇదీ చదవండి: బాక్సాఫీస్‌ దగ్గర జవాన్‌ కలెక్షన్ల తుపాన్‌.. రెండో రోజు ఎన్ని కోట్లంటే?)

త్వరలో  ఒక మంచి సినిమాతో ఆమె ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతుంది. అందుకు కథను కూడా లారెన్స్‌ సెలక్ట్‌ చేశాడని కూతురి తొలి సినిమాకు ఆయన డైరెక్షన్‌ చేస్తున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదితో ఆమె గ్రాడ్యేషన్‌ పూర్తి అవుతుందని తెలుస్తోంది. రాఘవి మోడ్రన్ డ్రెస్సుల్లో స్టైలిష్‌గా పోజులిచ్చిన ఫోటోలు కూడా తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకాలం లారెన్స్ తన కూతురిని ఎక్కడ దాచిపెట్టాడు అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)