Breaking News

నిర్మాతగా మారిన రాఘవేంద్రరావు మాజీ కోడలు

Published on Wed, 07/05/2023 - 19:46

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మాజీ కోడలు కనికా ధిల్లాన్‌ నిర్మాతగా అవతారమెత్తింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ నుంచి రచయితగా మారిన ఆమె గతేడాది రిలీజైన ఏక్‌ విలన్‌ రిటర్న్స్‌, రక్షా బంధన్‌లకు తనే స్వయంగా కథ అందించింది. ఇప్పుడేకంగా షారుక్‌ ఖాన్‌ నటిస్తున్న డుంకీ సినిమాకు కూడా తనే కథ అందించడం విశేషం. రచయితగా సత్తా చాటుతున్న ఆమె తాజాగా ప్రొడక్షన్‌ వైపు అడుగులు వేసింది.

కథా పిక్చర్స్‌ అనే బ్యానర్‌ను ప్రారంభించింది. తన తొలి ప్రాజెక్ట్‌ను దో పట్టి అని ప్రకటించింది. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో వెల్లడించింది. 'కథా పిక్చర్స్‌ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించినందుకు ఎంతో సంతోషంగా ఉంది. కాజోల్‌, కృతీ సనన్‌ వంటి ప్రతిభగల హీరోయిన్లతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది' అని ట్విటర్‌లో రాసుకొచ్చింది కనిక.

కనికా ధిల్లాన్‌ పర్సనల్‌ లైఫ్‌..
రాఘవేంద్రరావు తనయుడు, డైరెక్టర్‌ ప్రకాశ్‌ కోవెలమూడి- కనికా ధిల్లాన్‌ 2014లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2017లోనే వీరిద్దరూ విడిపోగా 2019లో వచ్చిన ‘జడ్జిమెంటల్ హై క్యా’ చిత్రానికి కలిసి పని చేశారు. ఈ చిత్రానికి ప్రకాశ్‌ దర్శకత్వం వహించగా.. కనికా కథా సహకారం అందించింది. ఆ తర్వాత వీరు విడాకులు తీసుకున్నారు. తర్వాత కనికా ధిల్లాన్‌ స్క్రీన్‌ రైటర్‌ హిమాన్షుతో ప్రేమలో పడగా 2021 ఆరంభంలో పెళ్లి చేసుకున్నారు. కాగా రాజ్‌ కుమార్‌ రావు ‘అనగనగా ఓ ధీరుడు’ అనే ఫాంటసీ చిత్రాన్ని తీసి ప్రకాష్‌ చేతులు కాల్చుకున్నాడు. ఆ తరువాత ‘జీరో సైజ్’ కూడా అత‌నికి పెద్ద‌గా పేరు తీసుకురాలేదు.

చదవండి: పక్షవాతానికి గురైన హీరో కాలు.. ఫెయిల్యూర్‌ నుంచి సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌గా

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)