Breaking News

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ప్రభాస్ హీరోయిన్

Published on Mon, 12/09/2024 - 13:45

తెలుగులో ఎ‍ప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. అప్పటికే ఉన్నవాళ్లు కనుమరుగైపోతుంటారు. పైన కనిపిస్తున్న బ్యూటీది కూడా దాదాపు అలాంటి పరిస్థితే. అప్పుడెప్పుడో 22 ఏళ్ల క్రితం హీరోయిన్‌గా తెలుగు సినిమాతో కెరీర్ మొదలుపెట్టింది. మూవీ సూపర్ హిట్ అయినా అదృష్టం కలిసిరాలేదు. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు శ్వేత అగర్వాల్. ఇలా చెబితే గుర్తురాకపోవచ్చు కానీ అల్లరి నరేశ్‌ తొలి మూవీ 'అల్లరి' మూవీలో హీరోయిన్ అంటే గుర్తుపడతారేమో! ఒకవేళ ఇది కాదంటే ప్రభాస్ 'రాఘవేంద్ర' సినిమాలో ఓ హీరోయిన్ అంటే గుర్తురావొచ్చు. ఈ రెండు మూవీస్‍‌తో బాగానే గుర్తింపు తెచ్చుకుందీ ముంబై చిన్నది. కానీ తర్వాత కెరీర్ సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది.

(ఇదీ చదవండి: పెళ్లి తర్వాత లైఫ్ గురించి చెప్పిన కొత్త కోడలు శోభిత)

తెలుగుతో పాటు కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మూవీస్ చేసింది కానీ పెద్దగా లక్ కలిసిరాలేదు. దీంతో 2010లో రిలీజైన 'షాపిత్' అనే హిందీ మూవీ తర్వాత యాక్టింగ్ పూర్తిగా పక్కనబెట్టేసింది. 2020లో ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్ కొడుకు ఆదిత్య నారాయణ్‌ని పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి పూర్తిగా ఫ్యామిలీ పర్సన్ అయిపోయింది. ఈమెకు ఓ కూతురు కూడా పుట్టింది. ఆ చిన్నారి ఫొటోలని ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటుంది.

అప్పట్లో 'అల్లరి' సినిమాలో అప్పు అనే పాత్రలో ఆకట్టుకున్న శ్వేత.. స్టార్ హీరోయిన్ అయిపోతుందేమో అని చాలామంది అనుకున్నారు. తర్వాత ప్రభాస్ 'రాఘవేంద్ర' మూవీలో చేసింది. కానీ పెద్దగా ఉపయోగపడలేదు. 'గమ్యం' మూవీలో ఐటమ్ సాంగ్ కూడా చేసింది కానీ ఈమెని దర్శకనిర్మాతలు పట్టించుకోలేదు. దీంతో ఫ్యామిలీ ఉమన్‌గా సెటిలైపోయింది.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 34 సినిమాలు)

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)