Breaking News

నా స్నేహితుడు విజయ్‌కి అభినందనలు: లారెన్స్‌

Published on Sat, 04/13/2024 - 18:22

కోలివుడ్‌ టాప్‌ హీరో విజయ్‌ సినిమాలతో పాటు రాజకీయ కార్యక్రమాల్లో కూడా బిజీగా ఉన్నారు. కొద్దిరోజు క్రితం తన తల్లి శోభ కోరిక మేరకు  సాయిబాబా  మందిరాన్ని ఆయన నిర్మించారు. అందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతూనే ఉన్నాయి. సాయిబాబా  మందిరాన్ని నిర్మించాలని తన కోరిక అని శోభ తెలిపారు. ఇదే  విషయాన్ని విజయ్‌తో  పలుమార్లు చెప్పగా.. కొంతకాలం క్రితం ఈ ఆలయాన్ని నిర్మించాడని ఆమె పేర్కొంది.

చెన్నైలోని కొరటూరులో ఉన్న సాయిబాబా ఆలయాన్ని తాజాగా ప్రముఖ హీరో లారెన్స్‌ దర్శించుకున్నారు. ఇదే విషయాన్ని తన ఎక్స్‌ పేజీలో ఇలా పంచుకున్నారు. 'అందరికీ నమస్కారం.. ఈరోజు నా స్నేహితుడు విజయ్ తన తల్లితో కలిసి కొరట్టూరులో కొత్తగా నిర్మించిన సాయిబాబా ఆలయానికి వెళ్లాను. నేను గతంలో రాఘవేంద్రుని ఆలయాన్ని నిర్మించి కుంభాభిషేకం చేసినప్పుడు విజయ్‌ గుడికి రావడమే కాకుండా నన్ను అభినందించే క్రమంలో నా కోసం ఒక పాట కూడా పాడారు. ప్రస్తుతం విజయ్‌ నిర్మించిన ఈ ఆలయానికి నేను రావడం చాలా సంతోషంగా ఉంది.

నా స్నేహితుడు విజయ్‌కి  హృదయపూర్వక అభినందనలు. నేను ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే నాకు స్వచ్ఛమైన దివ్య ప్రకంపనలు కనిపించాయి. ప్రతి ఒక్కరూ ఈ ఆలయానికి వెళ్లి సాయిబాబాను దర్శించుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.' అని అన్నారు. విజయ్ అమ్మగారితో లారెన్స్‌  కలిసి సందర్శించిన వీడియోను ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. అక్కడ ప్రతి గురువారం అన్నదానం ఉంటుందని శోభ తెలిపారు. ఆ సమయంలో తానే అక్కడకు వస్తానని ఆమె చెప్పారు. 'లియో' తర్వాత విజయ్ నటిస్తోన్న చిత్రం 'గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌'. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో టైమ్‌ ట్రావెల్‌ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)