Breaking News

'అతని వివరాలు తెలిస్తే చెప్పండి.. లక్ష రూపాయలు ఇస్తా'

Published on Thu, 09/11/2025 - 15:37

కోలీవుడ్ స్టార్‌ హీరో రాఘవ లారెన్స్‌ సినిమాలు మాత్రమే కాదు.. సమాజ సేవలో దూసుకెళ్తున్నారు. ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తనకు తెలిసిన మరుక్షణమే వెళ్లి దేవుడిలా సాయం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పేద రైతులకు, విద్యార్థులకు తనవంతుగా ఆర్థికంగా అండగా నిలిచారు. ఇటీవలే  పూరి గుడిసెలో జీవిస్తున్న ఓ దివ్యాంగురాలు శ్వేత కుటుంబానికి స్కూటీ బహుమతిగా ఇచ్చాడు.

ఇది జరిగిన మూడు రోజుల్లోనే మరో వృద్ధ దంపతులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చారు రాఘవ లారెన్స్. చెన్నైలో లోకల్‌ ట్రైన్స్‌లో దాదాపు 80 ఏళ్ల వృద్ధుడు  స్వీట్స్ విక్రయించడం సోషల్ మీడియాలో వైరలైంది. ఆ వయసులో తన భార్య చేసిన స్వీట్లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ఈ వార్త పలు మీడియా ఛానెల్స్‌లో ఈ న్యూస్ రావడంతో ఇది చూసిన రాఘవ లారెన్స్ చలించిపోయారు.

వెంటనే వారి వివరాలు కనుక్కుని రూ.లక్ష సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఎవరికైనా వారి వివరాలు తెలిస్తే తనకు తెలియజేయాలని ట్విటర్ వేదికగా కోరారు. వారి కోసం వివరాల కోసం ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదన్నారు. మీరు వారిని రైలులో చూసినట్లు అయితే అతని స్వీట్లు కొని వీలైన విధంగా వారికి మద్దతు నిలవండి అని లారెన్స్ విజ్ఞప్తి చేశారు. కాగా.. లారెన్స్‌ ప్రస్తుతం బుల్లెట్టు బండి సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత కాంచన 4 స్టార్ట్‌ చేయనున్నాడు.

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)