Breaking News

నా గుండె తరుక్కుపోతోంది.. నిన్ను కొట్టనురా.. లారెన్స్‌ భావోద్వేగం

Published on Sun, 06/29/2025 - 11:43

రాఘవ లారెన్స్‌ (Raghava Lawrence).. నటుడు, కొరియోగ్రాఫర్‌ మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా! లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా ఎన్నో మంచి పనులు చేశాడు. సోషల్‌ మీడియా వేదికగా ఆదుకోమని అర్థించిన ఎందరికో ఆపన్న హస్తం అందించాడు. తాజాగా ఈయన ఓ వ్యక్తిని కలుసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. విక్రమార్కుడు సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించిన రవిరాజ్‌ రాథోడ్‌ను కొన్నేళ్ల కిందట లారెన్స్‌ దత్తత తీసుకున్నాడు. 

చైల్డ్‌ ఆర్టిస్ట్‌ను చదివించాలనుకున్న లారెన్స్‌
తన ట్రస్ట్‌ ద్వారా మంచి హాస్టల్‌ వసతి ఉన్న పెద్ద స్కూల్లో వేశాడు. ఇందుకోసం నెలకు లక్ష రూపాయల ఫీజు కట్టేవాడు. కానీ ఆ వయసులో ఇవన్నీ తన బాగుకోసమే అని అర్థం చేసుకోలేని రవి రాజ్‌ (Ravi Raj Rathod).. చెప్పాపెట్టకుండా స్కూల్‌ మానేసి వెళ్లిపోయాడు. తిరిగి లారెన్స్‌ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్లలేదు. పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు అందరూ తనను తిప్పించుకున్నారే తప్ప ఎవరూ దారి చూపలేదని ఓ ఇంటర్వ్యూలో బాధఫడ్డాడు.

గుండె తరుక్కుపోతోంది
లారెన్స్‌ను కలుద్దామంటే తిడతాడో, కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదన్నాడు. పరిస్థితుల వల్ల మద్యానికి బానిసైనట్లు తెలిపాడు. ఈ ఇంటర్వ్యూ లారెన్స్‌ కంటపడింది. ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్‌ను వీడియోలో చూసి నటుడు భావోద్వేగానికి లోనయ్యాడు. నా గుండె తరుక్కుపోతోంది. మాస్‌ సినిమా షూటింగ్‌ సమయంలో ఇతడిని కలిశాను. తనను స్కూల్‌లో చేర్పించాను. ఒక సంవత్సరం తర్వాత అతడు బడి మానేసినట్లు తెలిసింది. అప్పటినుంచి కనిపించకుండా పోయాడు. తనను వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించాను, కానీ ఫలితం లేకుండా పోయింది.

ఒక్కసారి చూడాలనుంది
ఎన్నో ఏళ్ల తర్వాత అతడినిలా చూస్తున్నందుకు కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. చదువు మధ్యలో మానేసి వెళ్లిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతున్నాడు. నీకు ఒక్కటే చెప్పాలనుకుంటున్నా.. నేను నిన్ను తిట్టను, కొట్టనురా. నిన్ను చూడాలనుంది. ఒక్కసారి వచ్చి నన్ను కలువురా. నీకోసం నేను ఎదురుచూస్తూ ఉంటాను అంటూ ఎక్స్‌ (ట్విటర్‌)లో చెన్నైలోని లారెన్స్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ అడ్రస్‌ను పొందుపరిచాడు. ఇది చూసిన అభిమానులు.. ఇంత మంచోడివి ఏంటన్నా.. అని కామెంట్లు చేస్తున్నారు. రాఘవ లారెన్స్‌.. ప్రస్తుతం కాంచన 4, బెంజ్‌, అధిగరం, కాల భైరవ, బుల్లెట్‌, హంటర్‌ చిత్రాలు చేస్తున్నాడు. వీటిలో కాంచన 4 చిత్రాన్ని ఆయనే డైరెక్ట్‌ చేస్తున్నాడు.

చదవండి: దిల్‌రాజుకు పెళ్లయిందని తెలిసి వెనకడుగు వేశా.. తేజస్విని

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)