స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం క్లీన్ స్వీప్ చేశాం
Breaking News
అందరినీ భయపెట్టే ఈ హీరోను గుర్తుపట్టారా?
Published on Sat, 08/07/2021 - 10:47
Raghava Lawrence: పై ఫొటోలో అఘోరాగా కనిపిస్తున్న నటుడు ఎవరా అని బుర్ర బద్ధలు చేసుకుంటున్నారా? అతడెవరో కాదు, రాఘవ లారెన్స్. నటుడిగా, దర్శకుడిగా, డ్యాన్సర్‌గా రాణిస్తూ మల్టీ టాలెంటెడ్ అని పేరు తెచ్చుకున్నాడీ నటుడు. ప్రేక్షకులను భయపెట్టడమే పనిగా పెట్టుకున్న ఇతడు ముని, కాంచన, గంగ(కాంచన 2), కాంచన 3 సినిమాలు తీసి ప్రేక్షకులను గడగడలాడించాడు. తాజాగా అతడు మరోసారి జనాలను భయపెట్టేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది.
తను నటిస్తోన్న దుర్గ సినిమా ఫస్ట్ అండ్ సెకండ్ లుక్ పోస్టర్స్‌ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు రాఘవ. ఇందులో అతడు అఘోరా వేషంలో కనిపిస్తున్నాడు. పోస్టర్ చూస్తుంటే ఈ సినిమా కూడా హారర్ నేపథ్యంలోనే తెరకెక్కనున్నట్లు అర్థమవుతోంది. అయితే ఈ సినిమాలో రాఘవ నటిస్తున్నాడు కానీ దర్శకత్వ బాధ్యతలు తీసుకోలేదట. త్వరలోనే డైరెక్టర్ పేరును కూడా వెల్లడిస్తానంటున్నాడు. ఇదిలా వుంటే రాఘవ గతేడాది అక్షయ్ కుమార్ హీరోగా 'లక్ష్మి' సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా హాట్‌స్టార్‌లో రిలీజై సక్సెస్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే!
#Durga second look! #RagavendraProductions pic.twitter.com/XjNhGhmylU
— Raghava Lawrence (@offl_Lawrence) August 6, 2021
Tags : 1