Breaking News

దివ్యాంగుల ఇతివృత్తంతో చిత్రం చేస్తా: రాఘవ లారెన్స్

Published on Tue, 04/16/2024 - 10:19

ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవలారెన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. చాలా కాలం నుంచి అనాథలు, దివ్యాంగులని ఆదుకునేందుకు ట్రస్టు ఏర్పాటు చేసి, దాని ద్వారా వారికి తగిన సాయం చేస్తూ వస్తున్నాడు. ఎందరికో ఎన్నో విధాలుగా సాయం చేస్తూ.. తన చిత్రాల్లో దివ్యాంగులను నటింపజేస్తూ వారిలోని ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా దివ్యాంగులకు కానిదేదీ లేదనేలా వారిని తమిళ పారంపర్య కళ అయిన మల్లర్‌ కంబం అనే విలువిద్యలో ప్రోత్సహిస్తున్నారు.

కై కొడుక్కుమ్‌ కై అనే ఈయన నాయకత్వంలో దివ్యాంగుల బృందం ఇప్పటికే మల్లర్‌ కంబం అనే సాధారణ వ్యక్తులు కూడా చేయలేని సాహస కళను పలు వేదికలపై ప్రదర్శించి ప్రశంసలు అందుకున్నారు. కాగా ఈ బృందం సోమవారం రాఘవలారెన్స్‌ నేతృత్వంలో చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌లో మల్లర్‌ కంబం అనే సాహస కళను ప్రదర్శించారు. వీరి కళను ప్రోత్సహించాల్సిందిగా ఈ సందర్భంగా రాఘవలారెన్స్‌ విజ్ఞప్తి చేశారు.

వీరికి తాను తగినంత సాయం చేస్తున్నానని, తన చిత్రాల్లోనూ నటింపజేసే ప్రయత్నం చేస్తున్నానని చెప్పారు. అయితే కొందరు అన్ని చిత్రాల్లోనూ వీరిని ఎలా నటింపజేస్తామని అంటుంటారన్నారు. మీ ఇళ్లల్లోనో, ఇతరుల ఇళ్లల్లోనో జరిగే వేడుకల్లో ఇలాంటి టీమ్‌కు అవకాశం కల్పించి ప్రోత్సహించాలని కోరారు. తాను ఈ మల్లర్‌ కంబం కళ బృందంలోని ప్రతి ఒక్కరికీ ఒక స్యూటీని ఇవ్వనున్నానని చెప్పారు. అలాగే దివ్యాంగుల ఇతి వృత్తంతో ఒక చిత్రం చేయబోతున్నానని, అందులో తానూ దివ్యాంగుడి పాత్రలో నటించనున్నానని చెప్పా రు. ఈ చిత్రం ద్వారా వచ్చిన లాభాలతో వీరికి ఇళ్లు కట్టిస్తానని రాఘవ లారెన్స్‌ పేర్కొన్నారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)