Breaking News

యంగ్ హీరోలని డామినేట్ చేసిన డీ గ్లామర్ బామ్మ

Published on Mon, 03/02/2026 - 20:35

రాధిక.. ఈ పేరు ఇప్పటి జనరేషన్‌కి పెద్దగా తెలియకపోవచ్చు. ఎందుకంటే ముప్పై ఏళ్ల క్రితం తెలుగు, తమిళ స్టార్ హీరోలతో బోలెడన్ని సినిమాలు చేసింది. వయసు పెరిగిపోవడంతో తల్లి, పిన్ని తరహా పాత్రలు చేస్తూ వస్తోంది. అలాంటిది 63 ఏళ్ల వయసులో ఈమెని లీడ్ రోల్‍‌గా పెట్టి సినిమా తీస్తే కళ్లు చెదిరే కలెక్షన్స్ వస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే చాలామంది యంగ్ హీరోలనే డామినేట్ చేస్తోందని చెప్పొచ్చు.

(ఇదీ చదవండి: 'విరోష్' పెళ్లి కానుక.. శుభవార్త చెప్పిన విజయ్ దేవరకొండ)

తమిళ హీరో శివకార్తికేయన్ నిర్మాతగా రాధిక ప్రధాన పాత్రలో తీసిన సినిమా 'తాయ్ కిళవి'. పూర్తిగా తమిళ నేటివ్ టచ్ ఉన్న విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో దీన్ని తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్‌లో రాధిక లుక్ చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పూర్తిగా డీ గ్లామర్ లుక్. చాలామంది ఈ తరహా పాత్రలు చేయడానికి సాహసిస్తారు. కానీ రాధిక డేర్ చేసింది. ఇప్పుడది వసూళ్ల రూపంలో కనిపిస్తుంది. కేవలం 3 రోజుల్లో రూ.22 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు అధికారికంగా ప్రకటించారు.

రీసెంట్ టైంలో అటు తెలుగులో గానీ తమిళంలో గానీ చాలామంది మిడ్ రేంజ్ హీరోలే వీకెండ్ అయ్యేసరికి రూ.20 కోట్లు తెచ్చుకోవడం అనేది కష్టంగా మారిపోయింది. అలాంటిది రాధికని పెట్టి ఓ సినిమా తీస్తే దానికి ఈ రేంజు వసూళ్లు రావడం నిజంగా ఆశ్చర్యమే అని చెప్పొచ్చు. అయితే 'తాయ్ కిళవి' చిత్రం సక్సెస్ కావడానికి మరో కారణం కూడా ఉంది. అదే తమిళనాడులో ఈ మధ్య కాలంలో సరైన మూవీస్ లేకపోవడం. లెక్క ప్రకారం సంక్రాంతికి 'జన నాయగణ్' రావాలి. కానీ నిరవధిక వాయిడా పడింది. వచ్చిన మిగతా మూవీస్ అన్ని తేలిపోయాయి. పెద్ద హీరోలు, మిడ్ హీరోల సినిమాలేం లేకపోవడం రాధిక చిత్రానికి కొంతవరకు ప్లస్ అయిందని చెప్పొచ్చు.

'తాయ్ కిళవి' విషయానికొస్తే.. కోపం ఎక్కువగా ఉండే ఓ బామ్మ(రాధిక).. డబ్బులు వడ్డీలకు ఇస్తూ కాలం వెల్లదీస్తుంటుంది. ముక్కుసూటిగా మాట్లాడటం, తేడా వస్తే చితక్కొట్టేస్తూ ఉంటుంది. ముగ్గురు కొడుకులకు బాధ్యత లేకపోవడంతో వాళ్లని ఇంటి నుంచి తరిమేస్తుంది. అయితే ఈమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం ఒకటి మొదలవుతుంది. మరోవైపు హఠాత్తుగా పక్షవాతం వచ్చేసరికి బామ్మ మాట పడిపోతుంది. దీంతో కొడుకులు తిరిగి వస్తారు. వాళ్లకు సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇంతకీ అదేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)