Breaking News

వరలక్ష్మి శరత్‌కుమార్ బర్త్‌ డే.. సర్‌ప్రైజ్‌ చేసిన రాధిక

Published on Tue, 03/05/2024 - 11:53

నటుడు శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి నేడు (మార్చి 5) 39వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాధిక ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ రేర్‌ ఫోటోలతో ఓ వీడియోను విడుదల చేసి సర్‌ప్రైజ్‌ చేశారు. నటుడు శరత్‌కుమార్ 1984లో ఛాయాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు జన్మించిన కూతురే వరలక్ష్మి. 2000 సంవత్సరంలో శరత్‌కుమార్ ఛాయతో విడాకులు తీసుకుని నటి రాధికను ఆయన రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు రాహుల్ అనే కుమారుడు ఉన్నాడు. శరత్‌కుమార్ మొదటి భార్య ఛాయ ప్రస్తుతం తన కూతురు వరలక్ష్మితో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నారు.

వరలక్ష్మి శరత్ కుమార్ కూడా తన తండ్రి బాటలోనే సినిమా ఇండస్ట్రీలో మెప్పిస్తున్నారు. ప్రస్తుతం సౌత్‌ ఇండియాలో టాప్‌ నటిగా ఆమె కొనసాగుతున్నారు. కొద్దిరోజులుగా ఆమె నటించిన ప్రతి సినిమా బ్లాక్‌ బస్టర్‌గా నిలుస్తోంది. దీంతో ఆమెకు భారీ అవకాశాలు వస్తున్నప్పటికీ సెలెక్టెడ్‌ సినిమాలకే ప్రధాన్యత ఇస్తూ దూసుకుపోతున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవలే  వరలక్ష్మి పెళ్లి వార్త చెప్పింది. ఆమె త్వరలో నికోలయ్‌ సచ్‌దేవ్‌ను పెళ్లి చేసుకోబోతోంది. ముంబైలో ఆర్ట్ గ్యాలరీ నడుపుతున్న అతనితో చాలా రోజుల నుంచి ప్రేమలో ఉన్నట్లు తెలిపింది. వీరి ప్రేమకు కుటుంబ సభ్యులు ఓకే చెప్పడంతో సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. వరలక్ష్మి శరత్‌కుమార్ నేడు పుట్టినరోజు సందర్భంగా మొదట రాధిక ప్రేమతో ఒక వీడియో క్రియేట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపింది. ఆ వీడియో నెట్టింట వైరల్‌ అవుతుంది. వరలక్ష్మి ఫ్యాన్స్‌ కూడా విషెష్‌ చెబుతూ మెసేజ్‌లు చేస్తున్నారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)