Breaking News

విదేశీ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ నటి.. పోస్ట్ వైరల్!

Published on Wed, 10/25/2023 - 08:01

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటి రాధిక శరత్‌ కుమార్‌. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ నటిగా 1978లో భారతీరాజా దర్శకత్వం వహించిన కిళక్కే పోగుమ్‌ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రం విజయం తర్వాత నటిగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. 

(ఇది చదవండి: మెగా ఫోన్‌ పట్టనున్న రామ్ చరణ్ విలన్!)

తమిళం, తెలుగు, మలయాళం, హిందీ ఇలా పలు భాషల్లో ప్రముఖ హీరోల సరసన కథానాయకిగా నటించి బహుభాషా నటిగా రాణించారు. ఆ తర్వాత కూడా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మారి వివిధ రకాల పాత్రలో ఇప్పటికీ నటిస్తూనే ఉన్నారు. కాగా 2001 వివాహం చేసుకున్నారు.

 అలా తన 45 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలను చూసిన రాధిక శరత్‌ కుమార్‌ నిర్మాతగాను కొన్ని చిత్రాలు చేశారు. అదే విధంగా సినిమాలు కూడా నిర్మిస్తున్నారు. తాజాగా స్వదేశీ భాషలను అధిగమించి ఫ్రెంచ్‌ చిత్రంలో నటించడం విశేషం. 

ప్రస్తుతం రాధిక శరత్‌ కుమార్‌ ఆ చిత్రంలో నటించడానికి ఫ్రాన్స్‌ దేశానికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె ఆ చిత్ర షూటింగ్‌లో తన ఫొటోలను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అందులో తాను ఫ్రెంచ్‌ చిత్రంలో నటించడానికి ప్రోత్సహించిన తన భర్త శరత్‌ కుమార్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ప్రస్తుతం రాధిక శరత్‌ కుమార్‌ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: ఈ హీరోయిన్‌ని గుర్తుపట్టారా? నాలుగే సినిమాలు, టీమిండియా క్రికెటర్‌తో పెళ్లి!)

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)