Breaking News

సడన్‌గా ఓటీటీలో వచ్చేసిన రాధికా ఆప్టే సినిమా

Published on Wed, 06/18/2025 - 12:15

కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చిన వారాల వ్యవధిలోనే ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు కూడా హీరోయిన్ రాధిక ఆప్టే లేటెస్ట్ మూవీ ఒకటి అలానే సడన్‌గా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. బోల్డ్ కాన్సెప్ట్‌తో డార్క్ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి కరణ్ కాందహారి దర్శకుడు కాగా మిగిలిన విభాగాల్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేశారు. ఇంతకీ ఏంటీ సినిమా? ఎందులో అందుబాటులో ఉంది?

రాధికా ఆప్డే లేటెస్ట్ బోల్డ్ మూవీ 'సిస్టర్ మిడ్ నైట్'. మే 30న థియేటర్లలో రిలీజ్ కాగా.. ఇదో సినిమా ఉందనే విషయం కూడా జనాలకు తెలియలేదు. దీంతో ఎలా వచ్చిందో అలా వెళ్లిపోయింది. ఇప్పుడు ఈ చిత్రం రెండు వారాలు కాగానే ఓటీటీలోకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడే ఓ ట్విస్ట్. ప్రస్తుతం యూకేలో అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ, గూగుల్ ప్లే ఫ్లాట్ ఫామ్స్‌లో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన దగ్గర కూడా అందుబాటులోకి రావొచ్చు.

(ఇదీ చదవండి: రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్)

'సిస్టర్ మిడ్ నైట్' విషయానికొస్తే.. పెద్దలు పెళ్లి కుదర్చడంతో ఉమ(రాధికా ఆప్టే) గోపాల్‌ని పెళ్లి చేసుకుంటుంది. ముంబైలోని ఓ మురికివాడలో వీళ్లు నివసిస్తుంటారు. ఈ వివాహం ఇష్టం లేకుండా చేసేసరికి ఉమ.. భర్తతో కలవలేకపోతుంది. అతడు కూడా భార్యని తాకడానికి కూడా ఇబ్బంది పడుతుంటాడు. పెళ్లయి చాన్నాళ్లు అవుతున్నా భర్త తనతో అంటీముట్టనట్లు ఉండటంత.. తన లైంగిక వాంఛ గురించి బయటకు చెప్పలేక ఇబ్బంది పడుతుంది. అనారోగ్యానికి గురవుతుంది.

ఓరోజు ఎలాగోలా ధైర్యం చేసి భర్తతో కలుస్తుంది. కానీ తెల్లారి లేచి చూసేసరికి ఉమ శవమై కనిపిస్తాడు. దీంతో ఈమె ఏం చేసింది? చివరకు ఏమైందనేదే స్టోరీ. బోల్డ్ అండ్ డార్క్ కామెడీకి తోడు కొన్ని సీన్లు మరీ పచ్చిగా ఉన్నాయి. రాధికా ఆప్డే యాక్టింగ్ బాగుందని అంటున్నారు. ఒకవేళ పొరపాటున గనక ఈ మూవీ చూస్తే మాత్రం ఒంటరిగానే చూడండి.

(ఇదీ చదవండి: ఓటీటీ సినిమా 'పడక్కళమ్' రివ్యూ.. కామెడీ ఎంటర్‌టైనర్)

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)