Breaking News

'కూలీ'తో మారిపోయిన 'రచితా రామ్‌' ర్యాంక్‌

Published on Sat, 08/23/2025 - 09:00

కన్నడ నటి 'రచితా రామ్‌' పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. రజనీకాంత్‌, లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌లో విడుదలైన 'కూలీ' సినిమాలో 'కల్యాణి'గా ఆమె దుమ్మురేపింది. ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. అయితే, ఆమె ఇప్పుడు మరో ఘనతను సాధించింది. టాప్‌ 100 మోస్ట్‌ వ్యూడ్ ఇండియన్‌ స్టార్స్‌ లిస్ట్‌లో ఆమె చేరారు. ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్‌ పోర్టల్‌ ఐఎండీబీ(IMDb) దశాబ్దకాలంగా ఎక్కువ ప్రజాదరణ పొందిన భారతీయ నటీనటుల జాబితాను  ఎప్పటికప్పుడు విడుదల చేస్తుంది.  ఈ క్రమంలో తాజాగా రచితా రామ్‌ ర్యాంక్‌ను ప్రకటించింది.

కూలీ సినిమా తర్వాత రచితా రామ్‌ ఎక్కువ ప్రజాదరణ పొందిన తారగా రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.  ఐఎండీబీ విడుదల చేసిన రేటింగ్‌లో ఆమె  ఏకంగా 37వ ర్యాంక్‌లో నిలిచింది. అయితే, ఆమె గతంలో 392 ర్యాంక్‌లో ఉండేది. కూలీ సినిమా తర్వతా ఏకంగా 250 మందిని దాటుకొని ముందుకు దూసుకొచ్చింది. కానీ, శ్రుతి హాసన్ 44వ ర్యాంక్‌లో నిలిచింది. అయితే, ఆమె గతంలో 95వ ర్యాంక్‌లో కొనసాగింది.

రచితా రామ్‌ 2013లో మొదటిసారి దర్శన్‌తో 'బుల్ బుల్' చిత్రం ద్వారా వెండితెరపై మెరిసింది. ఈ మూవీ భారీ విజయం కావడంతో  ఆమెకు ఆఫర్లు క్యూ కట్టేశాయి. ఈ మూవీ తర్వాత 'డింపుల్ క్వీన్‌'గా కన్నడలో గుర్తింపు పొందింది. ఆపై తన నటనకు గాను ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డుతో పాటు మూడు సైమా అవార్డులను సొంతం చేసుకుంది. అయితే, ఆమె పాఠశాల విద్య వరకు మాత్రమే చదువుకుంది. ఆమె ఇప్పటి వరకు  పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్‌ కుమార్‌, ఉపేంద్ర, దునియా విజయ్‌ వివేక్‌ ఒబేరాయ్‌ వంటి స్టార్స్‌తో నటించింది. తెలుగులో చిరు మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్‌తో  'సూపర్ మచ్చి' సినిమాలో నటించింది.
 

Videos

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)