Breaking News

రాష్ట్రంలో తొలిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్: రాచకొండ సీపీ

Published on Thu, 12/12/2024 - 15:43

మంచు మనోజ్ ఫిర్యాదు ఆధారంగా మోహన్ బాబు మేనేజర్‌ను అరెస్ట్ చేశామని రాచకొండ సీపీ సుధీర్ బాబు వెల్లడించారు. ఈ వివాదంపై మొత్తం మూడు కేసులు నమోదు చేశామని సీపీ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా సెలబ్రిటీ బైండోవర్ తీసుకొచ్చామని అన్నారు. దీంతో పాటు మనోజ్‌ను ఏడాదిపాటు బైండోవర్ చేసినట్లు సీపీ వివరించారు. ఆయన నుంచి లక్ష రూపాయల పూచీకత్తు బాండ్ తీసుకున్నామని పేర్కొన్నారు.

మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన ఘటనపై కూడా కేసు నమోదు చేసినట్లు సీపీ సుధీర్ బాబు స్పష్టం చేశారు. అంతేకాకుండా మోహన్ బాబు ఇచ్చిన ఫిర్యాదుపై కూడా దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మోహన్ బాబు ఇంటి సమస్య వారి వ్యక్తిగతమని.. కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ఉంటే చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు.  మంచు విష్ణు, మంచు మనోజ్, మోహన్ బాబు బౌన్సర్లు గొడవ పడటమే వివాదానికి కారణమని సీపీ అన్నారు.

బైండోవర్​  అంటే ఏంటో తెలుసా?

ఎవరి వల్ల అయితే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తే ఆ వ్యక్తిని తహసీల్దార్, ఆర్డీవో ఎదుట హాజరుపరుస్తారు. చట్ట వ్యతిరేక పనులు చేయనని బాండ్ పేపర్‌పై అతనితో లిఖితపూర్వకంగా సంతకం తీసుకుని సొంత పూచీకత్తుపై విడుదల చేస్తారు. దీన్నే బైండోవర్​ అంటారు. బైండోవర్​ అంటే బాండ్ ఫర్ గుడ్ బిహేవియర్. బాండ్ ఇచ్చిన రోజు నుంచి ఆరు నెలల వరకు ఎలాంటి నేరాలు చేయకూడదు. ఈ ఆరు నెలల్లో ఏదైనా నేరం చేసినా, కేసు నమోదైనా బైండోవర్​ సమయంలో చేసిన డిపాజిట్ డబ్బులను ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. భారత శిక్షాస్మృతి చట్టం ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువసార్లు బైండోవర్​ అయితే అతనిపై రౌడీషీట్​ తెరవొచ్చు. 

తెలుగు రాష్ట్రాల్లో తొలిసారి సినీ సెలబ్రిటీ బైండోవర్

 

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)