Breaking News

రచ్చ రవి ఇంట్లో బలగం సీన్‌.. చెల్లె కోసం బోరుమని ఏడ్చిన కమెడియన్‌

Published on Sat, 04/01/2023 - 14:37

చిన్నచిన్న గొడవలతో అయినవాళ్లకే దూరమవుతున్నాం. ఉరుకుల పరుగుల జీవితంలో బంధాలకు, బంధుత్వాలను మర్చిపోతున్నాం. కానీ అంతా మనవాళ్లే అనుకుని కలిసిమెలిసి ఉంటే అంతకు మంచిన ఆనందం మరొకటి ఉండదు. ఇదే విషయాన్ని బలగంతో నిరూపించాడు దర్శకుడు వేణు. ఈ సినిమాలో జబర్దస్త్‌ కమెడియన్‌ రచ్చ రవి కూడా నటించాడు. అయితే రచ్చ రవి నిజ జీవితంలోనూ బలగం సీన్‌ ఎదురైంది. తను ఎంతగానో ప్రేమించిన చెల్లె మాట్లాడటం లేదని కన్నీరుమున్నీరుగా విలపించాడు.

తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. '2016లో మా ఇంటి గృహప్రవేశం జరిగింది. అప్పుడు వచ్చిన చెల్లె రజిత ఆ తర్వాత ఎన్నడూ మా ఇంటికి రాలేదు. తనిచ్చిన 123 రూపాయలతో హైదరాబాద్‌కు వచ్చాను. ఎన్నో తిప్పలు పడి ఈ స్థాయికి వచ్చాను. నాకు సమయం లేక తనతో సరిగా మాట్లాడలేదు. దాన్ని ఆమె తప్పుగా అర్థం చేసుకుంది. ఎన్నిసార్లు బతిమాలినా ఇంటికి రాననే చెప్తుంది.

నేనేమైనా తప్పు చేస్తే తిట్టాలి కానీ ఇన్నేళ్లవుతున్నా ఇంటికి రావడం లేదు. రాఖీ పండగ వస్తే నేనే చెల్లె ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుంటున్నాను, తను మాత్రం మా ఇంటికి రావడం లేదు. ఆమె ఇచ్చిన డబ్బులతోనే సిటీకి వచ్చి ఇంత సంపాదించాను. తను నా ఇంటికి వస్తే చూడాలనుంది. చెల్లె గుర్తుకు వస్తే నాకు కన్నీళ్లు ఆగట్లేదు' అని కంటతడి పెట్టుకున్నాడు రచ్చ రవి. ఇది చూసిన నెటిజన్లు 'మీ అన్న చేసిన బలగం సినిమా చూసి తప్పకుండా వచ్చి కలుస్తావని ఆశిస్తున్నాం', 'ఒక్కసారి వచ్చిపోవమ్మా.. ఆయన ఏడుస్తుంటే మాకు కన్నీళ్లొస్తున్నాయి' అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)