Breaking News

'రాయన్‌' ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. అక్కడ కేవలం రూ. 20 లక్షలే

Published on Sat, 07/27/2024 - 15:19

ధనుష్‌ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'రాయన్‌'. సన్‌ పిక్చర్స్‌పై కళానిధి మారన్‌ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. జులై 26న విడుదలైన ఈ చిత్రం మిక్సిడ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఒక వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పించేలా రాయన్‌ ఉందంటూ నెట్టింట ప్రచారం జరిగింది. ఇందులో దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, విష్ణు విశాల్, సందీప్‌ కిషన్, కాళిదాస్‌ జయరాం, ఎస్‌జే సూర్య, సెల్వ రాఘవన్‌ కీలక పాత్రలు పోషించారు. ఇలా స్టార్‌ యాక్టర్స్‌ ఉండటంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కానీ ఆ అంచనాలను రాయన్‌ చేరుకోలేకపోయింది.

రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ధనుష్ స్వీయ దర్శకత్వం వహించాడు. సినిమాపై మిక్సిడ్‌ టాక్‌ వచ్చినప్పటికీ రాయన్‌కు ఫస్ట్ డే కలెక్షన్స్ బాగానే వచ్చాయని తెలుస్తోంది. ధనుష్‌కి తమిళంలోనే కాదు  తెలుగులోనూ మంచి క్రేజ్‌ ఉంది. సార్, తిరు లాంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించాడు. 

ఇండస్ట్రీ లెక్కల ప్రకారం రాయన్ మూవీ విడుదలైన తొలి రోజు భారత్‌లో రూ. 13.65 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ వసూళ్లలో తెలుగు వెర్షన్ నుంచి రూ. 1.6 కోట్లు రాగా తమిళ వెర్షన్‌కు రూ. 11.85 కోట్లు వచ్చాయి. అయితే హిందీ  నుంచి కేవలం రూ. 20 లక్షలు మాత్రమే వచ్చాయని ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.20.70 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ రాబట్టింది.

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)