Breaking News

నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌ కొత్త సినిమా.. రేపే రిలీజ్‌

Published on Thu, 09/11/2025 - 12:17

తొలి సినిమా 'తిథి' (కన్నడ మూవీ)తోనే జాతీయ అవార్డు అందుకున్న రామ్‌ రెడ్డి మరో కొత్త చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆయన దర్శకత్వం వహించిన లేటెస్ట్‌ మూవీ జుగ్నుమా (Jugnuma - The Fable film). ఈ మూవీ ద ఫేబుల్‌ పేరిట అంతర్జాతీయ స్థాయిలో విడుదలైంది. ఇప్పుడు దేశీయ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 12న ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద అలరించనుంది. జుగ్నుమా కథ ఇప్పటిది కాదు! తొమ్మిదేళ్ల క్రితం హిమాలయాల్లో అగ్నిప్రమాదం జరిగినప్పుడు వాటిని ఆర్పేందుకు అగ్నిమాపక దళాలకు తనవంతు సాయం చేశాడు రామ్‌ రెడ్డి. 

ఆ సమయంలో ఈ కథ పురుడు పోసుకుంది. భారత్‌- నేపాల్‌ సరిహద్దులోని హిమాలయ ప్రాంతాల్లో ఈ మూవీ షూటింగ్‌ చేశారు. ఇందులో అడవిలో చెట్లను పరిరక్షించాల్సిన ఆవశ్యకత గురించి నొక్కి చెప్పారు. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియాంక బోస్‌ ప్రధాన పాత్రలు పోషించారు. బెర్లిన్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుకలో జుగ్నుమా ప్రదర్శితమైంది. లీడ్స్‌ ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌లో ఉత్తమ చిత్రం అవార్డు దక్కించుకుంది. సినిమా ప్రదర్శితమైన ప్రతి చోటా దర్శకుడి ప్రతిభకు ప్రశంసలు దక్కాయి. దర్శకనటుడు అనురాగ్‌ కశ్యప్‌, నిర్మాత గునీత్‌ మోంగా సైతం సినిమా చూసి అభినందించారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

కృష్ణాష్టమి సెలబ్రేషన్.. కిరణ్ అబ్బవరం కొడుకు ఇలా (ఫొటోలు

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)