బాబుకు ప్రతి రోజూ సినిమా చూపిస్తా.. జగన్ సంచలన వ్యాఖ్యలు
Breaking News
రాజమౌళి చేయలేనిది.. ‘రాకా’ టీమ్ చేసింది!
Published on Wed, 04/08/2026 - 12:26
సాధారణంగా ఓ పెద్ద సినిమా వస్తుందంటే.. టైటిల్ ముందుగానే లీకవుతుంది. ఇలా షూటింగ్ మొదలవ్వగానే అలా లుక్ బయటకు వస్తుంది. చిత్ర యూనిట్ ఎంత గోప్యంగా ఉంచినా సరే.. ఏదో ఒక రకంగా లీకేజీలు జరుగుతూనే ఉంటాయి. కానీ అల్లు అర్జున్-అట్లీ సినిమా విషయంలో ఇది జరగలేదు. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి ఒక్క లీకేజీ కూడా బయటకు రాలేదు. సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాల్ని ముందే లీక్ చేసే మీడియా కూడా ఈ సినిమా టైటిల్ ని పసి గట్టలేకపోయింది. లెగసీ, వైల్డ్ ఫైర్, అయాన్, స్పార్క్..ఇలా రకరకాల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కానీ ఈ చిత్రానికి ‘రాకా’(Raaka) అనే టైటిల్‌ని ఖరారు చేసిన విషయం అధికారికంగా ప్రకటించేవరకు ఎక్కడ బయటకు రాలేదు.
ఎంతో గోప్యంగా షూటింగ్ మొదలుపెట్టే రాజమౌళి సైతం ఈ లీకేజీ భారీ నుంచి తప్పించుకోలేకపోయాడు. మహేశ్ బాబుతో ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ మూవీ టైటిల్..అధికారిక ప్రకటనకు ముందే బటయకు వచ్చేసింది. అలాగే మహేశ్ లుక్‌తో పాటు కొన్ని స్టిల్స్ కూడా ముందే నెట్టింట దర్శనమిచ్చాయి. అలాగే ‘ఫౌజీ’లోని ప్రభాస్ లుక్ కూడా ముందే లీకైపోయింది. ఈ లీకేజీని అరికట్టడంలో ‘రాకా’టీమ్ సక్సెస్ అయింది.
(చదవండి: 'రాకా' పోస్టర్ రిలీజ్.. ఊహించని లుక్‌లో బన్నీ..)
టైటిల్ విషయం చిత్ర యూనిట్‌కి కూడా ముందుగా చెప్పలేదట. నిర్మాతలతో పాటు అల్లు అర్జున్-అట్లీకి తప్పా..మిగతావారెవరికీ ఈ సినిమా టైటిల్ తెలియకుండా జాగ్రత్త పడ్డారట. అలాగే అల్లు అర్జున్ లుక్ కూడా ఇలా ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. మనిషి, మృగం కలగలిపిన బన్నీ లుక్‌కి సంబంధించిన సన్నీవేశాలను చాలా గోప్యంగా చీత్రీకరించారట. అందుకే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఒక్క లీకేజీ కూడా రాలేదు. ఈ విషయంలో ‘రాకా’ టీమ్ నుంచి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి. వాళ్లు తీసుకున్న జాగ్రత్తలను ఫాలో అయితే.. లీకేజీల బాధ నుంచి బయటపడతారు.
రాకా విషయానికొస్తే.. ఈ చిత్రంలో బన్నీ హీరోగా, విలన్‌గా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు రిలీజ్ చేసింది విలన్ లుక్. హీరో పాత్రకు సంబంధించిన లుక్ చాలా స్టైలీష్‌గా ఉంటుందని టాక్. మరి ఆ లుక్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అందులో దీపికా పదుకొణె పేరు అధికారికంగా ప్రకటించారు. మరో ఇద్దరు ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంచారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
The wait is over.
Gear up for #RAAKA ! pic.twitter.com/yzuovTCEpe— Allu Arjun (@alluarjun) April 8, 2026
Tags : 1