Breaking News

Plane Crash: జీవితాల్ని నిలబెట్టిన విషాదం.. విడాకులు రద్దు

Published on Mon, 06/16/2025 - 17:12

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం బాధిత కుటుంబాలను శోకసంద్రంలోకి నెట్టేసింది. జీవితం శాశ్వతం కాదని, మరణం ఎప్పుడు, ఎటువైపు నుంచి వస్తుందనేది చెప్పలేమని సమస్త ప్రజానీకానికి గుర్తు చేసింది. భూమిపై ఉన్నన్ని రోజులు గొడవలు తగ్గించి ప్రశాంతంగా, అయినవారితో సంతోషంగా గడపమని సందేశాన్ని పంపింది. విమాన ప్రమాదం అనే విషాదం కొందరి జీవితాల్లో మార్పు తెచ్చిందంటోంది సింగర్‌, నటి రాగేశ్వరి. విడాకులకు సిద్ధమైన వారు కూడా మనసు మార్చుకుని కలిసిపోయారని చెప్తోంది. 

సడన్‌గా ఎందుకీ మార్పు?
మీకో విషయం తెలుసా? విమాన ప్రమాదం (Ahmedabad Air India Plane Crash) తర్వాత చాలామంది వారి కుటుంబాలకు ఫోన్‌ చేసి యోగక్షేమాలు అడుగుతున్నారు, కాసేపు మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన రెండు జంటలు విడాకుల వరకు వెళ్లగా.. ఇప్పుడు కలిసిపోయారు. సడన్‌గా వారిద్దరి కుటుంబాలు అహంకారాన్ని పక్కనపెట్టేశాయి. సమస్యలను పరిష్కరించుకున్నారు. అకస్మాత్తుగా ఎందుకింత మార్పు వచ్చింది? విపత్తులు వచ్చినప్పుడే మనకు జీవితం విలువ తెలిసొస్తుందని సైకాలజిస్టులు అంటున్నారు.

ప్రమాదాలే గుర్తు చేస్తాయి
ఎన్నో అపజయాలను చవిచూస్తే తప్ప విజయం అందదు. కొన్ని ఒడిదుడుకులను అధిగమిస్తే కానీ పైకి వెళ్లలేరు. ఇలాంటి విషాదాలు మనల్ని ఒక్కసారిగా ఆపేస్తాయి. జీవితంలో మనకు ఏది ముఖ్యమనేది గుర్తు చేస్తాయి. కాబట్టి ఇప్పుడైనా మీ కుటుంబానికి కాస్త సమయం కేటాయించండి. నువ్వెలాంటి బట్టలు వేసుకున్నావు? ఎలా కనిపిస్తున్నావు? ఏం మాట్లాడావు? అనేది జనాలు గుర్తుపెట్టుకోరు. కానీ ఎదుటివారితో ఎలా ప్రవర్తిస్తున్నావు? 

కుటుంబాన్ని ప్రేమించండి
వారిని ఎంత స్పెషల్‌గా చూస్తున్నావనేదే గుర్తుపెట్టుకుంటారు. మీ కుటుంబం ఎంత విలువైనదో గ్రహించండి. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. భూమిపై ఉన్నన్నాళ్లూ మనం పీల్చుకునే ఊపిరి, పొందే ప్రేమ మాత్రమే శాశ్వతం. కాబట్టి వీలైతే క్షమించండి, సున్నితంగా మాట్లాడండి, ప్రేమగా ఉండండి అని చెప్పుకొచ్చింది. రాగేశ్వరి లూంబ్‌.. ఆంఖెన్‌, మై ఖిలాడీ తు అనారీ, దిల్‌ కిత్నా నడాన్‌ హై వంటి పలు చిత్రాల్లో నటించింది. దునియా, ప్యార్‌ కా రంగ్‌, సచ్‌ కా సాత్‌ వంటి ఎన్నో పాటలు పాడింది.

విమానయానం విషాదం..
అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ వెళ్తున్న ఎయిరిండియా విమానం జూన్‌ 12న మెడికల్‌ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఓ వ్యక్తి తప్ప అందరూ సజీవ సమాధి అయ్యారు. అలాగే మెడికల్‌ కాలేజీ క్యాంటీన్‌లో భోజనం చేస్తున్న పలువురు మృతి చెందగా కొందరికి తీవ్రగాయాలయ్యాయి.

 

చదవండి: ప్రభాస్‌.. ఇద్దరు హీరోయిన్లు కావాలన్నాడు: మారుతి

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)