Breaking News

పదివేలకు పైగా పాటలు.. నేషనల్ అవార్డ్.. కానీ 37 ఏళ్లకే!

Published on Tue, 10/17/2023 - 18:39

సినీ ఇండస్ట్రీలో సింగర్లకు ప్రత్యేకస్థానం ఉంటుంది. రచయిత రాసిన పాటను మధురమైన స్వరాలను అందించండం వారికి మాత్రమే సొంతం. అలా సినీరంగంలో ఎంతోమంది ప్రముఖ గాయకులు ఉన్నారు. చిన్న వయస్సులోనే విజయం సాధించి ఈ రంగంలో కీర్తిని పొందినవారిని ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. తమ టాలెంట్‌తో సినీ ప్రేక్షకులను మైమరపించిన ఎందరో తారలు ఈ కాలగర్భంలో కలిసిపోయారు. అలాంటివారిలో ముఖ్యంగా దివ్యభారతి, సుశాంత్‌ సింగ్ రాజ్‌పుత్‌, జియాఖాన్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరిలాగే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సింగర్‌ స్వర్ణలత సైతం చిన్న వయసులోనే మరణించారు. ఈ స్టోరీలో ఆమె గురించి తెలుసుకుందాం. 

(ఇది చదవండి: ‘లియో’ వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ)

స్వర్ణలత.. ఈ పేరు హిందీతో పాటు సౌత్ ఇండియా ఇండస్ట్రీలో సుపరిచితం. 1973లో కేరళలో జన్మించిన ఆమె సెప్టెంబర్ 12, 2010న ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఆమె తన కెరీర్‌లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీతో సహా దాదాపు 10 భాషలలో ఏకంగా పదివేల పాటలకు పైగా ఆలపించింది.

ముఖ్యంగా స్వర్ణలత దక్షిణాది చిత్రాలకు చాలా పాటలు పాడినప్పటికీ.. ఆమె హిందీలోనూ గుర్తింపు తెచ్చుకుంది. నీతిక్కు తందానైలో కేజే యేసుదాస్‌తో కలిసి 'చిన్నచిరు కిలియే' అనే పాట పాడిన తర్వాత స్వర్ణలత అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత భారతీయ సంగీత పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో విజయం సాధించింది. కరుత్తమ్మ చిత్రంలోని "పోరాలే పొన్నుతాయి" పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ పాటను ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచారు. ఆయన సంగీతంలో జాతీయ అవార్డును అందుకున్న మొదటి మహిళా నేపథ్య గాయని కూడా స్వర్ణలతనే.

స్వర్ణలత తన ఫేవరెట్ సింగర్ అని గతంలోనే ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఎప్పుడో చెప్పారు. కేరళలోనే పుట్టి పెరిగిన ఆమె 37 సంవత్సరాల వయసులో చెన్నైలోని మలార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మరణించారు.

(ఇది చదవండి: దేశంలో రిచెస్ట్ సింగర్.. వందల కోట్ల ఆస్తి.. ఈమె ఎవరో తెలుసా?)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)