Breaking News

ప్రభుత్వం నుంచి నాకు ఎలాంటి సాయం వద్దు: ఆర్‌. నారాయణ మూర్తి

Published on Fri, 07/11/2025 - 07:03

ఆర్‌. నారాయణ మూర్తి చాలారోజుల తర్వాత లీడ్‌ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ‘పేపర్‌ లీక్‌’ అనేది ఉపశీర్షిక. నేటి సమాజంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో చెబుతూ ఆయన మూవీని తెరకెక్కించారు. ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్‌లతో పాటు దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ, జయరాజ్, నందినీ సిద్ధారెడ్డి, ప్రోఫెసర్‌ ఖాసీం, పలువురు విద్యార్థి సంఘాల నాయకులుపాల్గొన్నారు. యూనివర్సిటీ సినిమా కేవలం విద్యార్థులే కాదు.. ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా చూడదగిన మూవీ అని అన్నారు.

ఆర్‌. నారాయణ మూర్తి మాట్లాడుతూ.. నేటి సమాజంలో కాపీయంగ్అనేది చాలా ప్రమాదకరమైనదని ఆయన అన్నారు. మన విద్యారంగంలో కొన్నేళ్లుగా జరుగుతున్న  పేపర్‌ లీక్స్, గ్రూపు 1, 2 లాంటి ఉద్యోగ ప్రశ్నా పత్రాల లీక్స్‌ చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్‌ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? వాళ్లకుపాఠాలు బోధించిన గురువులు ఏం కావాలి? అని మా సినిమా ద్వారా ప్రశ్నిస్తున్నామన్నారు. ‘యూనివర్సిటీ’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అవసరం లేదని పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి అన్నారు. 'నా మిత్రులు అద్దంకి దయాకర్, అందెశ్రీ తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ మూవీకి పన్ను మినహాయింపు ఇప్పిస్తామన్నారు. నాపై ప్రేమతో మాట చెప్పినందుకు వాళ్లకు కృతజ్ఞతలు. కానీ, నా సినిమాకు ఎలాంటి పన్ను మినహాయింపు వద్దు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం వద్దు. సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్లండి చాలు’.' అని నారాయణ మూర్తి కోరారు.

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)