Breaking News

భారీ బడ్జెట్‌ పేరుతో ప్రజలపై భారం వేయకండి: నారాయణమూర్తి

Published on Sat, 05/31/2025 - 13:17

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్‌ ధరల పెంపుపై నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి అసంతృప్తి తెలిపారు. విడుదలైన ప్రతి సినిమాకు అలా ధరలు పెంచుకుంటూ పోతే  ప్రేక్షకులతో పాటు సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందన్నారు. క్రమేపి వారు థియేటర్‌కు వచ్చి సినిమా చూడటం తగ్గిస్తారని సూచించారు. చవకగా దొరికే వినోదం ఇప్పుడు చాలా ఖరీదుగా మారిపోయందని అభిప్రాయపడ్డారు. ఇకనుంచి అయినా సరే టికెట్‌ ధరలు పెంపు అంశంపై అందరూ ఒకసారి పరిశీలించాలని ఆయన కోరారు.

'భారీ ఖర్చుతో సినిమాలు తీయడం మంచిదే. కానీ, ఆ ఖర్చును ప్రజలపై రుద్ద వద్దు. హాలీవుడ్‌లో ఎన్నో వందల కోట్లతో సినిమాలు తీస్తున్నారు. మన దగ్గర షోలే, మోఘల్ ఏ ఆజాం లాంటి సినిమాలు వచ్చాయి. వాటి కోసం ధరలు పెంచలేదు. మన తెలుగులో ఐదేళ్ల పాటు లవకుశ తీశారు, ఆ సినిమాకు టికెట్ ధరలు పెంచమని అడగలేదు. సినిమాలు బాగుంటే తప్పకుండా జనాలు వస్తారు. టికెట్ ధరలు పెంచడం వల్ల అభిమానులే వాళ్ల హీరోల సినిమాలు చూడలేని పరిస్థి వస్తుంది.' అని ఆర్‌ నారాయణమూర్తి అన్నారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమ కోసం గద్దర్ అవార్డులను ప్రకటించడం చాలా గర్వంగా ఉందన్నారు. విజేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో సీఎం చంద్రబాబు కూడా నంది అవార్డులను ప్రకటించాలని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు