Breaking News

ఆగస్టులో యూనివర్సిటీ

Published on Fri, 07/11/2025 - 00:15

ఆర్‌. నారాయణ మూర్తి లీడ్‌ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘యూనివర్సిటీ’. ‘పేపర్‌ లీక్‌’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమా ఆగస్టు 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీలు గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్‌లతో పాటు దేశపతి శ్రీనివాస్, అందెశ్రీ, జయరాజ్, నందినీ సిద్ధారెడ్డి, ప్రోఫెసర్‌ ఖాసీం, పలువురు విద్యార్థి సంఘాల నాయకులుపాల్గొని, ‘‘యూనివర్సిటీ’ సినిమా కేవలం విద్యార్థులే కాదు... ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరూ చూడదగిన మంచి చిత్రం’’ అని కొనియాడారు.

ఆర్‌. నారాయణ మూర్తి మాట్లాడుతూ– ‘‘గత కొన్నేళ్లుగా మన విద్యారంగంలో జరుగుతున్న పేపర్‌ లీక్స్, గ్రూపు 1, 2 లాంటి ఉద్యోగ ప్రశ్నా పత్రాల లీక్స్‌ చూస్తుంటే విద్యార్థుల భవిష్యత్‌ ఏం కావాలి? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి? వాళ్లకుపాఠాలు బోధించిన గురువులు ఏం కావాలి? అని మా సినిమా ద్వారా ప్రశ్నిస్తున్నాం. కాపీయింగ్‌ అనేది చాలా ప్రమాదకరమైనది.

చూసి రాసినవాళ్లు డాక్టర్లు అయితే రోగులు బతుకుతారా? అలాంటివాళ్లు ఇంజినీర్‌ అయితే బ్రిడ్జిలు నిలబడతాయా? అందుకే విద్యను ప్రైవేటు మాఫియా కబంధ హస్తాల నుంచి విముక్తి చేసి, విద్యను జాతీయం చేయాలి. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి అని చాటి చెప్పేదే మా చిత్రం. ఈ సినిమాలో 5పాటలు ఉన్నాయి. స్వర్గీయ గద్దర్‌గారితోపాటు జలదంకి సుధాకర్, వేల్పుల నారాయణ, మోటపలుకుల రమేశ్‌ గొప్పగా రాశారు’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాబూరావు దాస్, కథ–స్క్రీన్‌ ప్లే–మాటలు–సంగీతం–దర్శకత్వం–నిర్మాణం: ఆర్‌. నారాయణ మూర్తి.

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)