ఆ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నా..: ప్రముఖ హీరో

Published on Wed, 11/22/2023 - 12:51

స్టార్‌ హీరో ఆర్‌. మాధవన్‌ ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేనాటికే హీరోయిన్‌ జూహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలని ఆశగా ఉండేదని చెప్పుకొచ్చాడు. ఈ విషయాన్ని అతడి తల్లికి కూడా చెప్పాడట. 1988లో వచ్చిన 'ఖయామత్‌ సే ఖయామత్‌ టక్‌' అనే సినిమా చూశాక ఆమెకు ఫిదా అయిపోయానంటున్నాడు మాధవన్‌.


జూహీ చావ్లా

ఆ సినిమా చూసి ఫిదా
ప్రస్తుతం ఈ హీరో 'ద రైల్వే మెన్‌' వెబ్‌ సిరీస్‌లో నటించాడు. ఇందులో జూహీ చావ్లా కూడా యాక్ట్‌ చేసింది. తాజాగా ఈ వెబ్‌ సిరీస్‌ ప్రమోషన్స్‌లో మాధవన్‌ మాట్లాడుతూ.. 'అదృష్టం బాగుండి ఈ సిరీస్‌కు జూహీ చావ్లా ఓకే చెప్పారు. ఇక్కడ మీ అందరికీ ఓ విషయం చెప్పాలి. 'ఖయామత్‌ సే ఖయామత్‌ టక్‌' సినిమా చూసినప్పుడు అమ్మ.. నేను ఈ హీరోయిన్‌ను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. అప్పుడు నాకున్న ఏకైక లక్ష్యం ఆమెను పెళ్లాడటమే!' అని చెప్పుకొచ్చాడు. కాగా ద రైల్వే మెన్‌ సిరీస్‌లో ముందుగా మాధవన్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత జూహీ చావ్లాను ఈ సిరీస్‌లో భాగం చేశారు.


భార్య సరితాతో మాధవన్‌

ఇండస్ట్రీకి పరిచయం
ఇకపోతే 'ఖయామత్‌ సే ఖయామత్‌ టక్‌' సినిమా 1988లో రిలీజైంది. అప్పటికి మాధవన్‌ తన కెరీర్‌ ప్రారంభించనేలేదు. అతడు 1993లో 'బనేగి అప్నీ బాత్‌' అనే టీవీ షో ద్వారా తొలిసారి స్క్రీన్‌పై కనిపించాడు. బుల్లితెరపై పలు షోలలో పార్టిసిపేట్‌ చేసిన అనంతరం 1997లో 'ఇన్‌ఫెర్నో' సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చాడు. దీనికంటే ముందు ఓ బాలీవుడ్‌ సినిమాలో ఒక పాటలో క్లబ్‌ సింగర్‌గా కనిపించాడు. తమిళ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌, మలయాళ, కన్నడ భాషల్లో నటించాడు. ఇతడు 1999లో సరితా బిర్జీ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మాధవన్‌ నటించిన పలు సినిమాలకు ఆమె కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసింది.

చదవండి: తెలుగులో ఆ స్టార్‌ హీరో టార్చర్‌ పెట్టాడు.. అతడి వల్లే 20 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరం: నటి

Videos

జగనన్న మళ్లీ వస్తేనే రాష్ట్రంలో మహిళలకు రక్షణ

2029 నీకు పుట్టగతులు ఉండవ్..! పరిటాల సునీతకు గోరంట్ల మాస్ వార్నింగ్

నా సర్వీసులో ఇలాంటి ఎన్నికలు ఎప్పుడూ చూడలేదు

మహిళ అని చూడకుండా నాపై దాడి చేసి.. చేతిని మెలిపెట్టి విరిచేశారు

సుప్రీం చెప్పినా లెక్కలేదు.. కూటమికి అడుగడుగునా జగన్ భయం

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)