Breaking News

థియేటర్లలో ఆల్కహాల్‌ అమ్మకాలు.. తూలుతూ సినిమా చూడొచ్చు!

Published on Sat, 04/12/2025 - 11:14

థియేటర్‌లో పాపకార్న్‌, ఫ్రాంకీస్‌, కూల్‌డ్రింక్స్‌ ఎవరైనా అమ్ముతారు. అదే ఆల్కహాల్‌ అమ్మితే ఎలా ఉంటుంది? అని ఆలోచించింది ప్రముఖ మల్టీప్లెక్స్‌ చైన్‌ పీవీఆర్‌ ఐనాక్స్‌ (PVR Inox). సినిమాలో దమ్మున్నా, లేకపోయినా మందు కోసమైనా జనాలు రాకపోరా? అని యోచిస్తోంది. అసలే జనాలు ఓటీటీకి బాగా అలవాటుపడిపోయారు.

జనాల్ని రప్పించడం కోసం..
అందులోనూ ఏ సినిమా అయిని 8 వారాలు తిరిగేసరికి ఓటీటీలో అందుబాటులోకి వస్తుందని తెలిసి చాలామంది థియేటర్‌కు వెళ్లడమే మానేశారు. వాళ్లను తిరిగి థియేటర్‌కు తీసుకురావాలంటే ఇలా ఏదో ఒక కొత్త ప్లాన్‌ అమలు చేయాల్సిందే అని పీవీఆర్‌ బలంగా ఫిక్సయింది. దీనివల్ల ప్రేక్షకులకు ఏదో ఒకలా కిక్కు ఎక్కించాలని నిర్ణయించుకుందన్నమాట! అందుకే బెంగళూరు, గుర్గావ్‌లో మద్యం లైసెన్సు కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది.

ఇబ్బందులు తప్పవా?
అటు ఆదాయం పెంచుకోవడంతోపాటు ఇటు సినీప్రియులకు అద్భుతమైన అనుభూతిని కల్పించేందుకు ఇలాంటి ఐడియాతో ముందుకు వస్తోందన్నమాట! కానీ, ఇది అమలు చేస్తే సినిమా చూసేందుకు వచ్చే జనాల కంటే మందు తాగేందుకు బారులు తీరేవారే ఎక్కువవతారని అంటున్నారు. అలాగే ఆడవారికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఇది కొత్తేమీ కాదు
థియేటర్లలో మద్యం అమ్మకాలు అన్న మాట కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది మన దేశంలో కొత్తేమీ కాదు. ఆల్‌రెడీ రెండుచోట్ల ఇది అమలవుతూనే ఉంది. న్యూఢిల్లీలోని డైరెక్టర్స్‌ కట్‌, ముంబైలోని మైసన్‌ ఐనాక్స్‌ మల్టీప్లెక్స్‌లోని లాంజ్‌ ఏరియాలో మద్యం అమ్ముతున్నారు. సినిమా ప్రారంభానికి ముందు, అయిపోయాక లాంజ్‌లో కూర్చుని కావాల్సినంత మద్యం కొనుక్కుని తాగొచ్చు. కానీ మందు తాగుతూ సినిమా చూసేందుకు మాత్రం అవకాశం లేదు.

చదవండి: ఓటీటీలో హారర్‌ థ్రిల్లర్‌ వెబ్‌ సిరీస్‌.. ఎప్పటినుంచంటే?

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)